iDreamPost
android-app
ios-app

ఓ వైపు భారీ వర్షాలు..పురిటి నొప్పులతో గర్భిణి విల విల.. దేవుడిలా వచ్చి కాపాడిన ఎమ్మెల్యే!

  • Published Jul 24, 2024 | 10:11 AM Updated Updated Jul 24, 2024 | 10:11 AM

MLA Tellam Venkat Rao: వృత్తి రిత్యా వైద్యులుగా కొనసాగిన వారు తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల్లో ఉన్న కూడా తమ ప్రొఫెషన్ ని కొనసాగిస్తుంటారు. అలా ఆపద సమయంలో బాధితులను కాపాడి డాక్టర్ వృత్తికే వన్నె తెచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు.

MLA Tellam Venkat Rao: వృత్తి రిత్యా వైద్యులుగా కొనసాగిన వారు తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల్లో ఉన్న కూడా తమ ప్రొఫెషన్ ని కొనసాగిస్తుంటారు. అలా ఆపద సమయంలో బాధితులను కాపాడి డాక్టర్ వృత్తికే వన్నె తెచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు.

  • Published Jul 24, 2024 | 10:11 AMUpdated Jul 24, 2024 | 10:11 AM
ఓ వైపు భారీ వర్షాలు..పురిటి నొప్పులతో గర్భిణి విల విల.. దేవుడిలా వచ్చి కాపాడిన ఎమ్మెల్యే!

గత పదిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి.. దీంతో జనాలు అష్ట కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్దులు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల ప్రభావంతో పలు స్కూల్క్ కి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ వైపు భారీ వర్షాలు పడుతున్నాయి.. పురిటి నొప్పులతో గర్భిణీలు సకాలంలో వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు  ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులకు భయపడకండి.. నేనున్నా అంటూ భరోసా ఇచ్చి ఇద్దరి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన భద్రాచలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

గోదావరి వరద, భారీ వర్షాలు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాన్ని ముంచెత్తుండటంతో భద్రాచలం వద్ద నీటిమట్టం అంతకంతకూ పెరిగి జనజీవనం అస్తవ్యస్తమైంది. మన్యం పల్లెలకు, మండల కేంద్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు వంకలు పొంగిపొర్లి జనం అడుగు బయటపెట్టలేని పరిస్థితి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నెలకొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం నిండు గర్భిణీలను ముందస్తుగానే భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించింది. ఇటీవల జరిగిన బదిలీలపై డాక్టర్ల కొరత ఏర్పడింది.ఆ సమయంలో ఇద్దరు గర్భిణీలు పురిటినొప్పులతో బాధపడుతున్నారు. దీంతో సిబ్బంది, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

సమాచారం అందుకున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అక్కడికి చేరుకున్నారు. తాను సివిల్ సర్జన్ గా పనిచేసిన అనుభవం ఉందని.. తాను పురుడు పోస్తానని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇద్దరు గర్భిలకు పురువు పోసి కాపాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ.. ఆస్పత్రికి చేరుకోగానే ఒక్కరే గైనాకాలజిస్ట్ ఉన్నారు. వరదల కారణంగా గర్భిణీలను ఎటూ తరలించే అవకాశం లేదు. ఎమ్మెల్యే కన్నా ముందు నేను ఒక డాక్టర్‌ని… వెంటనే వారిని ఆపరేషన్ థియేటర్ కి తరలించి శస్త్ర చికిత్స చేసి సుఖ ప్రసవం జరిగేలా చేశాను. ఇప్పుడు తల్లీ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు. గర్బిణీలకు ప్రసూతి సేవలు అందించిన ఎమ్మెల్యే వెంట్రావు గొప్పతనంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.