P Krishna
రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూశారు.
రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూశారు.
P Krishna
ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అవగాణ లేమి ఇలా ఎన్నో కారణాల వల్ల నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది.. ఎంతోమంది అనాథలుగా మారిపోతున్నారు. ప్రమాదాలను నివారించడానికి అధికారులు రోడ్డు భద్రతా చర్యలు కఠినతరం చేస్తున్నా ఈ ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. తాజాగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి (33) చెందారు. ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడిక్కడే కన్నుమూశారు. పటాన్ చెరు సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ఢీ కొట్టింది. దీంతో ఆమె కారు డ్రైవర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్తితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఆమెను మృత్యువ మరోసారి వెంటాడింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ సుల్తాన్ పూర్ ఓఆర్ఆర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో ఆమె ఆక్కడిక్కడే మృతి చెందడం బీఆర్ఎస్ నేతలు షాక్ కి గురయ్యారు. గత ఏడాది ఇదే ఫిబ్రవరి 19న ఆమె తండ్రి సాయన్న గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన స్థానంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17,169 ఓట్ల మెజార్టీతో లాస్య నందిత ఎమ్మెల్యేగా గెలిచారు. చిన్న వయసులో ఆమె పదవిలోకి వచ్చారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్ ఉందని బావించిన తరుణంలో.. చిన్న వయసులతోనే ఆమె కన్నుమూయడం అటు పార్టీలోనూ.. ఇటు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.