Thummala Nageshwar Rao:రైతులకు గుడ్ న్యూస్.. ఆరోజే 2 లక్షల రుణమాఫీ!

రైతులకు గుడ్ న్యూస్.. ఆరోజే 2 లక్షల రుణమాఫీ!

Thummala Nageshwar Rao: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన, రైతు సంక్షేమంపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. ఈ క్రమంలోనే రైతు రుణమాఫీపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది రేవంత్ సర్కార్.

Thummala Nageshwar Rao: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన, రైతు సంక్షేమంపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. ఈ క్రమంలోనే రైతు రుణమాఫీపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది రేవంత్ సర్కార్.

గత ఏడాది తెలంగాణలో జరిగిన శాసన సభ ఎన్నికల సందర్భంగా ‘ఆరు గ్యారెంటీ పథకాలు’ ప్రజల్లోకి తీసుకువెళ్లింది కాంగ్రెస్ పార్టీ. ఆరు గ్యారెంటీ పథకాలపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపై చేశారు. అంతేకాదు కొద్దిరోజుల్లోనే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు.ఈ మధ్యనే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడమే కాదు.. నెరవేర్చుతున్నారు. తాజాగా రైతులకు మరో గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ సర్కార్. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో రైతులకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు.దీనిపై ప్రతిపక్ష నేతలు రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మాట తప్పుతుందని విమర్శలు కురిపించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 లోపే 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో అంటూ వచ్చారు. ఈ క్రమంలోనే మాట నిలబెట్టుకుంటూ జులై 18వ తేదీన తొలి విడతగా లక్షలోపు రుణాలు ఉన్న దాదాపు 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6 వేల కోట్లకు పైగా నిధులు జమచేశారు. లక్షన్నర‌లోపు రెండో విడదలో రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు మూడో విడతలో రుణమాఫీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ వేధికగా రెండవ విడతగా 6,40,223 మందికి రూ.6190 కోట్లు విడుదల చేశారు. తాజాగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

ఆగస్టు 14 న లక్షన్నర నుంచి 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని అన్నారు. రెండు లక్షల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇంత వరకు ఏ రాష్ట్రం కూడా పూర్తి స్థాయిలో రుణాల మాఫీ చేయలేదు.. ఆ ఘనత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే దక్కింది. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నిండా ముంచిందని అసహనం వ్యక్తం చేశారు. రుణాలు మాఫీ కాని రైతులు అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు అని అన్నారు. వారికి తమ పూర్తి వివరాలు ఇవ్వవాలని సూచించారు. టెక్నికల్ ఇబ్బందులు ఏమైనా ఉంటే క్లియర్ చేస్తామని అన్నారు. రైతుల పేరు మీద బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పనికిమాలిన రాజకీయాల మానేసి ప్రజలకు పనికివచ్చే పనులు చేస్తే బాగుంటుందని అన్నారు తుమ్మల.

Show comments