iDreamPost
android-app
ios-app

తెలంగాణ రైతులకు శుభవార్త..త్వరలోనే ఆ డబ్బులు కూడా అకౌంట్ లో

  • Published Apr 13, 2024 | 5:22 PM Updated Updated Apr 13, 2024 | 5:22 PM

తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ ఓ తీపి కబురును అందించారు. దీంతో ఎప్పటి నుంచే ఆ విషయంలో ఎదురుచూస్తున్న అన్నదాతలకు ఇది ఒక చక్కటి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ ఓ తీపి కబురును అందించారు. దీంతో ఎప్పటి నుంచే ఆ విషయంలో ఎదురుచూస్తున్న అన్నదాతలకు ఇది ఒక చక్కటి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

  • Published Apr 13, 2024 | 5:22 PMUpdated Apr 13, 2024 | 5:22 PM
తెలంగాణ రైతులకు శుభవార్త..త్వరలోనే ఆ డబ్బులు కూడా అకౌంట్ లో

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజసంక్షేమం కోసం ఇచ్చి హామీలను శరవేగంగా పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి భాద్యతలను చెపట్టిన నుంచి రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పుట్టినిల్లుగా మారింది. ఈ క్రమంలోనే.. రాష్ట్రంలో నిరంతరం శ్రమిస్తున్న రైతున్నాలకు కూడా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే క్రమంలో సర్కార్ చకచక ముందుకు సాగుతుంది. ఇప్పటికే రైతుల సంక్షేమం పై దృష్టి సారించి వారికి అండగా నిలబడటం కోసం.. రైతు భరోసా కింద అన్నదాతలను అదుకోవడం, అలాగే పంట పెట్టుబడి పై రుణాలు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్రంలోని రైతులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరో తీపి కబురును అందించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వరిధాన్యం కొనుగోళ్లకు కొన్ని ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు.  అయితే ఈ కేంద్రాల ద్వారా ఇప్పటికే పంట కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో తాజాగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రైతులకు మరో తీపి కబురు చెప్పారు.  కాగా, గతంలో వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ బోనస్ అంశం పై మంత్రి కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే వరి ధ్యాన్యానికి  రూ.500లు బోనస్‌పై విధి విధానాలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ఇక ఎన్నికల్లో భాగంగా.. ఇచ్చిన ఆరు గ్యారంటీలన్నీ ఒక్కటిఒక్కటి  అమలు చేస్తున్నమని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే.. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు.

కాగా, ఇప్పటికే  రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. పైగా , మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్ల, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక ధాన్యానికి కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని.. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మరి, తెలంగాణ రైతులకు త్వరలోనే బోనస్ అందిస్తున్నమని మంత్రి శ్రీధర్ బాబు చెప్పిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.