iDreamPost
android-app
ios-app

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్‌పై కీలక ప్రకటన!

  • Published Aug 01, 2024 | 1:10 PM Updated Updated Aug 01, 2024 | 1:10 PM

Telangana Assembly: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు తాము ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని.. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో కొన్ని పథకాలు ప్రారంభించారు. తాజాగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.

Telangana Assembly: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు తాము ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని.. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో కొన్ని పథకాలు ప్రారంభించారు. తాజాగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్‌పై కీలక ప్రకటన!

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ ను  గద్దె దింపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలు, మేనిఫెస్టోలో కీలక హామీలు ఇవ్వడంతో ఓటర్ల నమ్మకం కలిగి ఆ పార్టీకి జై కొట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.  సీఎం గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపై చేశారు.  ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగున్నాయి. ఈ సందర్బంగా పలు బిల్లులను ప్రవేశ పెట్టి వాటిపై చర్చించారు. తాజాగా తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ సర్కార్. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుత్నాయి. ఈ సందర్బంగా 3 బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉండటంతో సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. అనంతరం మంత్రి శ్రీదర్ బాబు స్కిల్ వర్సిటీ బిల్లు ప్రవేశ పెట్టారు. తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతూ.. త్వరలో జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో 2 లక్షల మందికి ఉద్యోగాలు భర్తి చేస్తామన్నారు. అసెంబ్లీలో ‘యంగ్ ఇండయా స్కిల్ యూనివర్సిటీ’ బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని, గ్రాడ్యుయేట్లలో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు కొరవడ్డాయని అన్నారు. వారిలో స్కిల్స్ పెంపుపై పారిశ్రామక వేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించాలని అన్నారు.

స్కిల్ యూనివర్సిటీ ఎంతోమంది నిరుద్యోగులకు చక్కటి ఉపాది కల్పిస్తుంది..తద్వారా రాష్ట్రాభివృద్ది జరుగుతుంది. తెలంగాణలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు స్కిల్ వర్సిటీ ఊతమిస్తుంది. 2024-25 సంవత్సరంలో రెండు వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తాం.. వచ్చే ఏడాదిలో పదివేల మందికి శిక్షణ ఇస్తాం.వర్సిటీకి సంబంధించి శాశ్వత క్యాంపస్ ముచ్చర్లలో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో విద్ార్థలుకు ఇంటర్న్‌షిప్, అప్రెంటీషిప్ పెట్టాలనుకుంటున్నామని అన్నారు. ఇందుకోసం 60 మంది అద్యాపక నిపుణులను ఏర్పాటు చేస్తామని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు.