iDreamPost
android-app
ios-app

Minister Seethakka: మంత్రి సీతక్క కీలక ప్రకటన.. అనాథ పిల్లల కోసం

  • Published Jan 03, 2024 | 9:53 AM Updated Updated Jan 03, 2024 | 1:07 PM

తెలంగాణలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది.. ముఖ్యయంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనదైన పరిపాలన కొనసాగిస్తున్నారు. ఆయన కేబినెట్ లో మంత్రి సీతక్క పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

తెలంగాణలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది.. ముఖ్యయంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనదైన పరిపాలన కొనసాగిస్తున్నారు. ఆయన కేబినెట్ లో మంత్రి సీతక్క పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

Minister Seethakka: మంత్రి సీతక్క కీలక ప్రకటన.. అనాథ పిల్లల కోసం

తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. పదేళ్లుగా కొనసాగిన బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టింది. డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి కెబినెట్ లో పదకొండు మంది మంత్రులు కొనసాగుతున్నారు. ములుగు ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల విషయంలో దృష్టిసారిస్తుంది. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు. తాజాగా మంత్రి సీతక్క అనాథ పిల్ల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి సీతక్క తనదైన దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆమె సెక్రటేరియెట్ లో ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్ శాఖ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  అంగన్ వాడీ కేంద్రాల బలోపేతం పై అన్ని రకాల చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. ప్రైమరీ పాఠశాలల వద్దే అంగన్ వాడీ కేంద్రాలు ఉండేలా చూడాలని సూచించారు. అంతేకాదు అక్కడే ఫ్రీ స్కూళ్ల ఏర్పాటు పై అధ్యయం చేయాలని కోరారు.

minister seetha akka

తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశాల్లో 2 శాతం కోటా కేటాయించేలా ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. అంతేకాదు అనాధ పిల్లలను దత్తత తీసుకునే నిబంధనలను సులభతరం చేయాలని సూచించారు. అంగన్ వాడీ కేంద్రాలకు మండల కేంద్రాల్లో డైరీల నుంచి సప్లై అయ్యేలా చూడాలని తెలిపారు. ఇందుకోసం ఒక పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని ఆమె కోరారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.