P Krishna
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజరవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన దంసారి అనసూయ అలియస్ సీతక్క ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజరవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన దంసారి అనసూయ అలియస్ సీతక్క ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు.
P Krishna
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన బాటలోనే మంత్రులు పయనిస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవకతవకలపై రిపోర్టు తెప్పించుకొని ప్రక్షాణళ కార్యక్రమం మొదలు పెట్టారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కెబినెట్ లో పనిచేస్తున్న మంత్రుల్లో సీతక్క ఒకరు. 2018,2023 లో ములుగు నియోజకవర్గానికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. బడుగు, బలహీన వర్గాలు, గిరిజనుల అభివృద్ది కోసం పాటుపడుతున్నారు.. అందుకే ఆమెను సీతక్క అని పిలుస్తుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా అటవీ అధికారులపై మంత్రి సీతక్క మండిపడ్డారు. అసలు ఏం జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాహా మంత్రి సీతక్క జంగు బాయి జాతర సందర్భంగా కెరిమెరిలోని గొండి గ్రామ పరిధిలో గల జంగు బాయి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆది వాసులతో కలిసి వారి ఆచార సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజల్లోపాల్గొన్నారు. గుట్ట లోని ఉన్న గుహ లోపలకు వెళ్లి జంగు బాయికి ప్రత్యేక పూజలు, దీప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘జంగు బాయి దేవత ఆదివాసుల ఆరాధ్య దైవం.. ఆమె ఏది కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. ప్రకృతిలో సహజ సిద్దంగా ఏర్పడిన జంగు బాయి పుణ్యక్షేత్రం అభివృద్ది కి నిధులు కేటాయించి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ పుష్యమాసంలో జరిగే కేస్లాపూర్ నాగోబా జాతర అంగరంగ వైభవంగా జరిగేలా చేస్తామని.. ఈ జాతరకు 20 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నాం.. అలాగే మర్లవాయి, జంగుబాయి కి కూడా నిధులు కేటాయిస్తాం’ అని అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క అటవీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాల పేరుతో అటవీ అధికారులు ఆదివాసులను హింసిస్తూ ఉంటే ఇకపై చూస్తూ ఊరుకునేది లేదు అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అడవి తల్లిని నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులు ఎవరికీ హాని తలపెట్టారు.. వారి విషయంలో అటవీ అధికారులు మానవతా విలువలు కలిగి ఉండాలని ఆమె సూచించారు. గిరిజన ప్రాంతాల్లో అధికారులు ఇప్పటి వరకు చేసిన నిర్వాకాలు చాలని.. పోడు భూములపై అటవీ అధికారులు ఇకపై ఓవరాక్షన్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అంతేకాదు.. ఇక నుంచి అధికారులు గిరిజనుల హక్కులకు అండగా నిలిచి పనిచేయాలని అన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.