Dharani
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తోన్న ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారినికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం. ఆ వివరాలు..
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తోన్న ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారినికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. అంతేకాక అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా చెప్పినట్లుగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం మొదలు పెట్టింది. దీని వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరగడం మాత్రమే కాక ఆదాయం కూడా భారీగానే పెరిగింది. ఈ పథకం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆడవారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత జర్నీ పథకాన్ని చాలా మంది స్వాగతించగా.. ఆటో, క్యాబ్ డ్రైవర్లు వ్యతిరేకించారు. దీని వల్ల తమ ఆదాయం తగ్గిపోతుందని.. ప్రభుత్వ చర్యలు తమ పొట్ట మీద కొట్టడమే అని ఆందోళన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆటో, క్యాబ్ డ్రైవర్లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా దీనిపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు నెలల్లోగా ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించి.. వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా పొన్నం ప్రభాకర్ గురువారం సచివాలయంలో ఆటో యూనియన్ల నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకం ప్రారంభించామని తెలిపారు. దీని వల్ల మహిళలకు చాలా మేలు కలుగుతుందని.. అయితే అదే సమయంలో ఆటో డ్రైవర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అయితే తమ ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్లకు తగిన న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. మహిళలకు ఫ్రీ బస్సు అనేది మా విధానమని.. ఆటో కార్మికులకు తాము వ్యతిరేకం కాదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
ప్రయాణికుల వద్దకు బస్సులు వెళ్లవని.. వాటి వద్దకే ప్యాసింజర్స్ వస్తారని.. అలా వారు రావాలంటే ఆటోలే కీలకమన్నారు పొన్నం. ఆటో డ్రైవర్లు బీఆర్ఎస్ ట్రాక్‌లో పడొద్దని.. వారి సమస్యల పరిష్కారినికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రవాణా శాఖ అధికారుల నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఈ సందర్భంగా వారిని అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఇప్పటికే తమ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్నా ట్రాఫిక్ చలాన్లపై 80 శాతం రాయితీ ఇచ్చిందని గుర్తు చేశారు.