iDreamPost
android-app
ios-app

RTC ఉత్తమ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్, సజ్జనార్‌ పురస్కారాలు

RTC Best Employees Awards: ఆర్టీసీలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను ప్రభుత్వం సత్కరించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్తమ ఉద్యోగులకు పురస్కారాలు అందజేశారు.

RTC Best Employees Awards: ఆర్టీసీలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను ప్రభుత్వం సత్కరించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్తమ ఉద్యోగులకు పురస్కారాలు అందజేశారు.

RTC ఉత్తమ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్, సజ్జనార్‌ పురస్కారాలు

సమాజంలోని అత్యంత కీలకమైన రంగాల్లో ఆర్టీసీ కూడా ఒకటి. ప్రజలను ఒకచోట నుండి మరోచోటుకి చేర్చి.. జీవితాలు స్తంభించి పోకుండా చేయడం ఈ రంగానికే చెందింది. ఇంత అద్భుతమైన బాధ్యతని ఎంతో శ్రద్దగా నిర్వర్తించే ఆర్టీసీ ఉద్యోగులను గౌరవించుకోవడం నిజంగా గొప్ప విషయం. తాజాగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఇలాంటి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం ఆర్టీసీ కళా భవన్‌లో ఆర్టీసీ గ్రాండ్‌ ఫెస్టివల్‌ ఛాలెంజ్‌ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 2023-24 సంవత్సరానికి గాను ఎన్నికైన ఉత్తమ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తమ చేతుల మీదగా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీకి రథ చక్రాలు, పునాదులు డ్రైవర్లేనని ఉద్యోగులపై ప్రశంసలు కురిపించారు.

ఇక హైదరాబాద్ డిపో-1 నుండి ఉత్తమ కండెక్టర్ గా గుండాల వెంకట నరసింహారెడ్డి, ఉత్తమ డ్రైవర్ గా డి. ఆంజనేయులు పురస్కారాలు అందుకున్నారు. డిపో మేనేజర్ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ స్వాతి సహాయ సహకారాలతో వీరు బెస్ట్ సర్వీస్ అందించడం జరిగింది. ఇక వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 36 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఈ పురస్కారాలు అందటం విశేషం. ఇక ఇదే సమయంలో మహాలక్ష్మి స్కీమ్‌ పేరు మీదుగా మహిళా ఉద్యోగులకు కూడా త్వరలో పురస్కారాలు అందించాలని రవాణా శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş