iDreamPost
android-app
ios-app

అదిరిపోయే శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్! వారికి ఉచితంగా మోపెడ్ వాహనాలు!

  • Published Nov 16, 2024 | 5:17 PM Updated Updated Nov 16, 2024 | 5:17 PM

Minister Ponnam Prabhakar: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఇప్పటికే పరిపాలనా విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Minister Ponnam Prabhakar: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఇప్పటికే పరిపాలనా విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అదిరిపోయే శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్! వారికి ఉచితంగా మోపెడ్ వాహనాలు!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తనదైన దూకుడు పెంచారు. తాజాగా కల్లుగీత కార్మికులకు గొప్ప శుభవార్త చెప్పారు. ఇప్పటికే కల్లు గీత కార్మికుల కోసం రక్షణ.. కాటమయ్య రక్షక కవచాలు పంపిణీ చేస్తుండగా మరో తీపి కబురు అందించింది తెలంగాణ సర్కార్. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం హుస్నాబాద్ లో నిర్వహించిన ‘గీత కార్మికులు, వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కాటమయ్య రక్షక కవచాలను మంత్రి పంపిణీ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కల్లగీత కార్మికులు గుడ్ న్యూస్ అందించారు రేవంత్ సర్కార్.  ఈ విషయం గురించి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..  తాటి చెట్టు ఎక్కడం, దిగడం గీత కార్మికులకు ప్రాణాలతో చెలగాటం అని అన్నారు. కల్లుగీత సందర్భంగా ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోతున్న దురదృష్ట సంఘటనలు ఇప్పటి వరకు ఎన్నో జరిగాయ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ప్రమాదాలను అరికట్టడానికి ఐఐటీ విద్యార్థులు రక్షక కవచాన్ని తయారు చేశారు. దాని గురించి పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి వాటిని కాటమయ్య రక్షక కవచం పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ గీత కార్మికులకు పంపిణీ చేస్తుందని అన్నారు. ఈ కిట్స్ పై క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇచ్చే విషయంలో ఏమాత్రం జాప్యం ఉండకూడదు అని అధికారులను ఆదేశించారు. గీత కార్మికులు తమ వృత్తి కొనసాగిస్తూ కుటుంబాలను పోషించుకోవడమే కాదు.. తమ పిల్లలను చదువులు చదివించాలని మంత్రి ఆకాంక్షించారు. కాలువలు, చెరువు గట్లపై, రోడ్ల పక్కన ఇతర ప్రాంతాల్లో నాటే చెట్లలో 50 శాతం తాటి, ఈత చెట్లను నాటాలని మంత్రి తెలిపారు.

పెద్ద ఎత్తున ఉన్న స్థలంలో తాటి, ఈత చెట్లను నాటితే అక్కడ బోర్లు వేయించే బాధ్యత తాము తీసుకుంటామని మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. గీత కార్మికులకు సంబంధించిన ఏమైనా పాత బకాయీలు ఉంటే విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఉదయం లేచిన మొదలు సాయంత్రం వరకు తాటి, ఈత వనాలకు వెళ్లేందుకు.. వచ్చేందుకు గీత కార్మికులు ఇబ్బందులు పడుతున్నాం అంటూ ఓ గీత కార్మికులు మంత్రితో విన్నవించుకున్నాడు. దీనిపై స్పందించిన పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేదని, 2025 మార్చి నాటికి గీత కార్మికులకు మోపెడ్ వాహనాలు అందిస్తామని కీలక ప్రకటన చేశారు. గీత కార్మికులు ప్రభుత్వం ఇచ్చే ఫలాలను సక్రమంగా సద్వినియోగం చేసుకొని తమ ప్రాణాలు రక్షించుకొని మెరుగైన జీవితాన్ని అనుభవించాలని ఆయన ఆకాంక్షించారు. గీత కార్మికుల మోఫెడ్ వాహనాలు మంజూరు చేస్తామన్న విషయం వినగానే వారంతా ఆనందం వ్యక్తం చేశారు.