iDreamPost
android-app
ios-app

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి‌‌కి స్వల్ప గాయాలు! ఏమైందంటే?

  • Published Sep 02, 2024 | 12:48 PM Updated Updated Sep 02, 2024 | 12:48 PM

Ponguleti Srinivas Reddy Got Minor Injuries: ప్రస్తుతం తెలంగాణలో భారీగా వర్సాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా కాల్వలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే పలువురు మంత్రులు వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి ఖమ్మం రూరల్ ప్రాంతాల్లో బాధితులను కలిసేందుకు వెళ్లారు.

Ponguleti Srinivas Reddy Got Minor Injuries: ప్రస్తుతం తెలంగాణలో భారీగా వర్సాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా కాల్వలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే పలువురు మంత్రులు వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి ఖమ్మం రూరల్ ప్రాంతాల్లో బాధితులను కలిసేందుకు వెళ్లారు.

  • Published Sep 02, 2024 | 12:48 PMUpdated Sep 02, 2024 | 12:48 PM
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి‌‌కి స్వల్ప గాయాలు! ఏమైందంటే?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది.  భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ఆయా ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేస్తున్నారు. దీంతో దిగువన ఉండే కొన్ని గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలతో అప్రమత్తమైన అధికారులు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయా నియోజకవర్గాల్లో వరత బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్నారు. తాజాగా ఖమ్మంలో మంత్రి పొంగులేటి వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిగా స్వల్ప ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..

ఖమ్మం రూరల్ ప్రాంతంలో వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎడమ కాలుకు స్వల్ప గాయం అయినట్లు వార్తలు వస్తున్నాయి. మొన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు ఖమ్మం రూరల్ మండలంలోని జలగం నగర్- ఖమ్మం కాలువ రోడ్డు ప్రాంతాల్లో మున్నేరు వాగు వరద పోటెత్తింది. సోమవారం ఉదయం మంత్రి పొంగులేటి జలగం నగర్, టెంపుల్ సిటి, నాయుడుపేట, కేబీఆర్ నగర్ వరద ముంపు బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీలోని వరద బాధితులను పరామర్శించడానికి టూ వీలర్ బైక్ పై వెళ్లారు. ఈ క్రమంలోనే కాలనీలో బండి స్కిడ్ అయి జారిపోగా ఎడమ కాలుకు స్వల్ప గాయం అయినట్లు వార్తలు వస్తున్నాయి. వెంటనే భద్రతా సిబ్బంది ఆయనను క్యాంప్ ఆఫీస్ కి తరలించినట్లు తెలుస్తుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

ఇదిలా ఉంటే మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం నగరంలోని మున్నేరు వాగు ఉధృతంగా పొంగి ప్రవహిస్తుంది. మున్నేరు వాగుపై నుంచి వచ్చే నీటి తీవ్రతతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల గ్రామాలు జల దిగ్భంధంలో చిక్కుకుపోవడంతో సహాయం కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు. పలు గ్రామాల్లో కరెంట్ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.