Krishna Kowshik
తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. ఆయన సత్తుపల్లికి తన వాహనంలో వెళుతుండగా.. కారు టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో..
తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. ఆయన సత్తుపల్లికి తన వాహనంలో వెళుతుండగా.. కారు టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో..
Krishna Kowshik
తెలంగాణ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు పంక్చర్ అయింది. ఈ రోజు ఉదయం ఆయన సత్తుపల్లికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పొంగులేటి కారు వైరా బ్రిడ్జి దగ్గరకు రాగానే టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో వాహనం కాస్తంత అదుపుతప్పినట్లు అయ్యింది. పోలీసులు, భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయనను మరో వాహనంలో తరలించారు. ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదని తెలుస్తుంది. పొంగులేటి ప్రస్తుతం.. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్‌లో రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
కాంగ్రెస్ కార్యకర్తగా ఆయన రాజకీయ జీవితం మొదలైంది. వివిధ హోదాల్లో పనిచేశారు. 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ తర్వాత కాలంలో తెలంగాణ వైకాపా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆ పార్టీ తరపున ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి, టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్)లో చేరారు. అయితే ఖమ్మంలో జరిగిన ఓ ఆత్మీయ సమ్మేళనంలో పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సస్పెండ్ అయ్యారు. తెలంగాణ ఎన్నికలకు ముందు అంటే 2023లో ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ (టీ-పీసీసీ) ప్రచార కమిటీ కో-ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆ ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది.. రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు.