iDreamPost
android-app
ios-app

Nandi Awards: నంది అవార్డులపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్య.. ఏమన్నారంటే?

  • Published Dec 30, 2023 | 10:54 AM Updated Updated Dec 30, 2023 | 11:00 AM

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనదైన పాలనతో దూసుకువెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన కెబినెట్ లో పదకొండు మంది మంత్రులు తమ శాఖల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనదైన పాలనతో దూసుకువెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన కెబినెట్ లో పదకొండు మంది మంత్రులు తమ శాఖల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

  • Published Dec 30, 2023 | 10:54 AMUpdated Dec 30, 2023 | 11:00 AM
Nandi Awards: నంది అవార్డులపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్య.. ఏమన్నారంటే?

తెలంగాణలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కేబినెట్ లో పదకొండు మంది మంత్రులు నియమితులయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ఉండగా.. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రేడ్డి రోడ్లూ, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రిగా నియమితులైనారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 28 నుంచి అభయ హస్తం కార్యక్రమం ద్వారా ఆరు గ్యారంటీల పథకానికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమం జనవరి 6 వరకు కొనసాగుతుంది.  ఇదిలా ఉంటే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీనీ ఇండస్ట్రీకి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. వివరాల్లోకి వెళితే..

వెండితెరపై నటించిన ప్రతి ఒక్క నటుడికి తన జీవితంలో ఒక్కసారైన నంది అవార్డు తీసుకోవాలని ఉంటుంది. తెలుగు చరిత్ర, కళలకు ప్రతీకగా ఉన్న లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు, కళాకారులకు నంది అవార్డు ఇస్తుంటారు.  ఈ అవార్డు తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు గా భావిస్తుంటారు. ఇండస్ట్రీలో ఈ సంప్రదాయం 1964 నుంచి ప్రారంభం అయ్యింది. గత ఐదు సంవత్సరాల నుంచి ‘నంది’అవార్డుల ప్రస్తావనే లేదు.. చివరిసారిగా 2017లో ప్రకటించారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి.. ఈ అవార్డుపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ప్రభుత్వాలతో పలు దఫాలుగా చర్చించినా ఫలితం కనిపించలేదు. ఇక నంది అవార్డులు ఉండకపోవచ్చు అన్న సమయంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నంది అవార్డులపై కీలక ప్రకటన చేశారు.

ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ‘2024 ఉగాది నుంచి నంది అవార్డులను అధికారికంగా ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. సినీ పరిశ్రమను సత్కరిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.. కళాకారుల్లో ఉత్సాహం నింపినట్లు అవుతుంది. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన కళాకారులకు నంది అవార్డులు ఇస్తాం. ఈ విషయం గురించి సీఎం రేవంత్ రెడ్డితో ఇప్పటికీ చర్చించాం’ అని అన్నారు. సీనియర్ నటులు మురళీమోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థావన పురస్కరించుకొని హైదరాబాద్ లోని దసపల్లా హూటల్ లో వీబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రత్యేక కార్యక్రం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీ మోహన్ కి ‘నటసింహ చక్రవర్తి’ బిరుదును ప్రధానం చేసి సత్కరించారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం నంది అవార్డులు విషయంలో ఇంత గొప్ప ప్రకటన చేయడం చాలా సంతోషంగా ఉందని.. ఇది ప్రతి కళాకారుడికి ఇచ్చే గొప్ప గౌరవం అని నటుడు మురళీ మోహన్ అన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.