iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: మంత్రి కోమటిరెడ్డికి అస్వస్థత… యశోదా హాస్పిటలో చేరిక!

  • Published Dec 13, 2023 | 9:41 AM Updated Updated Dec 13, 2023 | 9:41 AM

తెలంగాణ ఎన్నికలు ముగిశాయి.. అధికార పార్టీ బీఆర్ఎస్ పై కాంగ్రెస్ విజయం సాధించడంతో డిసెంబర్ 7 న సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పదకొండు మంది మంత్రులు ఆయతో ప్రమాణస్వీకారం చేశారు.

తెలంగాణ ఎన్నికలు ముగిశాయి.. అధికార పార్టీ బీఆర్ఎస్ పై కాంగ్రెస్ విజయం సాధించడంతో డిసెంబర్ 7 న సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పదకొండు మంది మంత్రులు ఆయతో ప్రమాణస్వీకారం చేశారు.

బ్రేకింగ్: మంత్రి కోమటిరెడ్డికి అస్వస్థత… యశోదా హాస్పిటలో చేరిక!

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పదకొండు మంత్రి మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రుల్లో నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దూకుడు పెంచింది. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేశారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రమైన గొంతునొప్పితో సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో చేరారు. ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. రెండు రోజుల పాటు రెస్టు తీసుకోవాలని సూచించడంతో అడ్మిట్ అయ్యారు. ఢిల్లీ నుంచి రాగానే ఆయన గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడటంతో వైద్యుల సూచన మేరకు యశోద ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఆయన విరామం లేకుండా ప్రచారం చేయడం.. ఎన్నికల సభల్లో ప్రసంగించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో గొంతు ఇన్పెక్షన్ కి గురైనట్లు తెలుస్తుంది.. అందులోనూ ప్రస్తుతం శీతాకాలం, వాతావరణ చల్లగా మారిపోయింది. ఈ సమస్యతో ఆయన మరింత ఇబ్బందికి గురైనట్లు తెలుస్తుంది.

సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫి శాఖ కేటాయించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ పర్యటనలో ఆయన ఉమ్మడి ఏపీ భవన్ కి వెళ్లారు. మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఏపీకి ప్రత్యేక హూదా కోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ని ఆదుకోవాలని ప్రధాని హూదాలో ఉన్న మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని కోమటిరెడ్డి గుర్తుచేశారు. కానీ విభజన తర్వాత హామీ అమలు చేయకపోవడం బాధాకరం అని అన్నారు.  కోమటిరెడ్డి యశోద ఆసుపత్రిలో ఆడ్మిట్ అయిన విషయం తెలుసుకొని పలువురు మంత్రులు, నేతలు ఆయనను చూడటానికి వెళ్తున్నారు.