P Krishna
Komati Reddy Venkat Reddy Humanity: ప్రజా ప్రతినిధి అంటే ప్రజల కష్టాలు తెలుసుకొని వారికి కొండంత అండగా నిలిచి ధైర్యం చెబుతూ.. వారి కష్టాలను తీర్చాలి. అలాంటి నాయకుడిని ప్రజలు ఎప్పటికీ గుండెల్లో పెట్టుకొని చూస్తారు.
Komati Reddy Venkat Reddy Humanity: ప్రజా ప్రతినిధి అంటే ప్రజల కష్టాలు తెలుసుకొని వారికి కొండంత అండగా నిలిచి ధైర్యం చెబుతూ.. వారి కష్టాలను తీర్చాలి. అలాంటి నాయకుడిని ప్రజలు ఎప్పటికీ గుండెల్లో పెట్టుకొని చూస్తారు.
P Krishna
ఇటీవల తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించింది. తెలంగాణలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే మహాలక్ష్మీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి మంత్రి వర్గం కూడా తమదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. గత ప్రభుత్వం లోటు పాట్లు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గొప్ప మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం ముషిపట్ల గ్రామానికి చెందిన మహిళ భర్త ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ తో కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు సంతానం. భర్త హాస్పిటల్ ఖర్చులకు ఉన్న ఆస్తి మొత్తం ఊడ్చుకుపోయింది. దీంతో ఆ మహిళ దిక్కుతోచని పరిస్థితిలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహాయాన్ని అర్ధించేందుకు ముగ్గురు పిల్లలతో కలిసి ముషిపట్ల గ్రామం నుంచి హైదరాబాద్ కి చేరుకుంది. ఆ మహిళకు మంత్రి అడ్రస్ తెలియదు. కలిసిన వారిని అడ్రస్ అడుగుతూ ఎలాగో అలా బంజారా హిల్స్ లోని కోమటిరెడ్డి ఇంటి వద్దకు చేరుకుంది. అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉండటంతో బిక్కు బిక్కుమంటూ తన ముగ్గురు పిల్లలతో అక్కడే కూర్చుంది.
మంత్రి కోమటిరెడ్డి పనుల నిమిత్తం బయటకు వెళ్తుంగా.. అక్కడ దీనంగా కూర్చున్న ఆ మహిళను చూసి తన వాహనాన్ని ఆపించారు. ఎవరమ్మా మీరు అని స్వయంగా వెళ్లి అడగడంతో ఆమె ఒక్కసారిగా బోరున విలపించింది. తన పరిస్థితి మొత్తం మంత్రితో చెప్పుకుంది. తన భర్త బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయాడని.. ఉన్న ఆస్తి మొత్తం తన భర్తను బతికించుకోవడం కోసం ఖర్చు చేశానని..ప్రస్తుతం తమ వద్ద చిల్లి గవ్వ కూడా లేదని తన కష్టాన్ని చెప్పుకొచ్చింది. తన భర్త కోసం చేసిన డబ్బులు సీఎంఆర్‌ఎఫ్ కింద ఇప్పించాలని మంత్రి కోమటిరెడ్డిని కోరింది. ఆ మహిళ బాధలు విన్న కోమటిరెడ్డి ఒక్కసారిగా చలించిపోయారు. పిల్ల కష్టాలు ఏంటో తనకు తెలుసు అని ఇంట్లోకి పిలిపించుకొని వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ముగ్గురు పిల్లలకు స్వయంగా ఇంట్లోకి వెళ్లి చాక్లెట్లు తెచ్చి ఆప్యాయంగా తినిపించారు.
ఇకపై ఎలాంటి కష్టం లేకుండా చూస్తానని.. ముగ్గురు పిల్లలు సార్ మాకు బాగా చదువుకోవాలని ఉందని చెప్పారు.. వారి మాటలకు కోమటిరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. మీరు ఎంత వరకు చదివితే అంత వరకు చదివిస్తా అని మాట ఇచ్చారు. ఆ మహిళకు వెంటనే లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అంతేకాదు సీఎం కార్యాలయం లో సీఎంఆర్ఎఫ్ చూసే అధికారితో స్వయంగా మాట్లాడి వైద్య ఖర్చులు మొత్తం మంజూరు చేయాలని ఆదేశించారు. తానే చెక్కును ఇంటికి పంపిస్తానని భరోసా ఇచ్చారు. ఎలాంటి కష్టమొచ్చినా నా ఇంటి గుమ్మం తెరిచే ఉంటుంది తల్లి అంటూ హామీ ఇచ్చి ధైర్యం చెప్పారు. కోమటిరెడ్డి గొప్ప మనసుకు ఆ మహిళ కృతజ్ఞతలు తెలిపింది.