iDreamPost

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాలు ఫోర్జరీ! వాటి కోసం సిఫార్స్ లేఖలు..

  • Author Soma Sekhar Published - 10:15 AM, Mon - 21 August 23
  • Author Soma Sekhar Published - 10:15 AM, Mon - 21 August 23
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాలు ఫోర్జరీ! వాటి కోసం సిఫార్స్ లేఖలు..

తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు షాకిచ్చారు ఇద్దరు వ్యక్తులు. ఏకంగా ఆయన సంతకాన్నే ఫోర్జరీ చేసి.. సిఫార్స్ లేఖలను తయ్యారు చేసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు పంపించారు. దీంతో కంగుతిన్నారు అధికారులు. గతంలో ఎన్నడు కూడా ఇలాంటి సిఫార్స్ లేఖలు రాలేదని వారు తెలిపారు. ఇక ఈ విషయాన్నిఅధికారులు మంత్రి ఎర్రబెల్లి దృష్టికి తీసుకెళ్లగా.. ఆరా తీసిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ఇటీవల సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరుతో కొన్ని సిఫార్స్ లేఖలు వచ్చాయి. గతంలో ఇలాంటి సిఫార్స్ లేఖలు రాలేదని అధికారులు తెలిపారు. ఈ లేఖల విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. దీంతో ఈ సిఫార్స్ లేఖలపై ఆరాతీయగా.. ఇద్దరు వ్యక్తులు ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తేలింది.

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం నర్రెగూడెం గ్రామానికి చెందిన ఎండీ. గౌస్ పాషా, గుంటి శేఖర్ లుగా పోలీసులు గుర్తించారు. వీరు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరుతో నకిలీ లెటర్ హెడ్ ను తయారు చేయడంతో పాటు.. ఏకంగా మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి కలెక్టర్ కు సిఫార్స్ లేఖలను పంపినట్లుగా విచారణలో తేలింది. ఈ విషయంపై మంత్రి ఓఎస్డీ డా. రాజేశ్వర్ రావు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గౌస్ పాషా, గుంటి శేఖర్ లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ఇదికూడా చదవండి: లోయలో పడిన ఆర్మీ వాహన ఘటన.. తెలంగాణకు చెందిన జవాన్ మృతి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి