nagidream
Hyderabad Metro Partnership With Rapido To Book Tickets Through Rapido App: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్తే గిప్తే హైదరాబాద్ మెట్రో చెప్పాలి కానీ ర్యాపిడో చెప్పడం ఏంటి? అసలు ర్యాపిడోకి, మెట్రోకి సంబంధం ఏంటి? అనే కదా మీ డౌటు. సంబంధం ఉంది. ఉంది కాబట్టే ర్యాపిడో మెట్రో ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదివేయండి.
Hyderabad Metro Partnership With Rapido To Book Tickets Through Rapido App: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్తే గిప్తే హైదరాబాద్ మెట్రో చెప్పాలి కానీ ర్యాపిడో చెప్పడం ఏంటి? అసలు ర్యాపిడోకి, మెట్రోకి సంబంధం ఏంటి? అనే కదా మీ డౌటు. సంబంధం ఉంది. ఉంది కాబట్టే ర్యాపిడో మెట్రో ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదివేయండి.
nagidream
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ ర్యాపిడో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకూ మెట్రో యాప్ ద్వారా లేదంటే డిజిటల్ పేమెంట్ యాప్ ల ద్వారా మెట్రో టికెట్లు బుకింగ్ చేసుకునే ప్రయాణికులకు ఇక నుంచి మరింత ఈజీగా మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. నగరంలో చాలా మంది ర్యాపిడో బైక్ ట్యాక్సీ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇంటి దగ్గర నుంచి మెట్రో స్టేషన్ కి.. అక్కడ నుంచి వేరే స్టేషన్ కి వెళ్ళాక అక్కడ నుంచి గమ్యస్థానానికి వెళ్లేందుకు ప్రయాణికులు ర్యాపిడో బైక్ ట్యాక్సీని వాడుతున్నారు. ఇలాంటి వారికి ర్యాపిడో మెట్రో సేవలను అందించేందుకు సిద్ధమైంది. ర్యాపిడో యాప్ ద్వారా మెట్రో రైలు టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటును తీసుకొచ్చింది.
దీని కోసం ర్యాపిడో హైదరాబాద్ మెట్రో రైలుతో భాగస్వామ్యం చేసుకుంది. పక్కా స్ట్రాటజీతోనే మెట్రో రైలు టికెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ర్యాపిడో. బైక్, ఆటో, క్యాబ్ సేవలతో పాటు ఇప్పుడు మెట్రో టికెట్ల బుకింగ్ సేవలను కూడా అందిస్తుంది. దీంతో ప్రయాణికులు ర్యాపిడో యాప్ ద్వారా దగ్గర్లోని మెట్రో స్టేషన్ కి రైడ్ ని బుక్ చేసుకోవడంతో పాటు రిలాక్స్డ్ గా వెళ్లాల్సిన గమ్యస్థానానికి మెట్రో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ర్యాపిడో యాప్ లో మెట్రో టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించడం ద్వారా వేలాది మంది ప్రయాణికులకు సమయంతో ఆదా అవ్వడంతో పాటు ప్రయాణం కూడా ఈజీ కానుంది. ఇక హైదరాబాద్ మెట్రో రైలు.. మెట్రో రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్ట్ గా ఉంది. ప్రతి రోజూ యావరేజ్ గా 4.80 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతుంది. ఇప్పుడు ర్యాపిడో యాప్ లో మెట్రో టికెట్ బుకింగ్స్ తో మెట్రో సేవలను మరింత విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది.
ర్యాపిడో యాప్ ద్వారా కనీసం 15 శాతం మెట్రో రైల్ టికెట్లను ప్రయాణికులు బుక్ చేసుకుంటారని హైదరాబాద్ మెట్రో అంచనా వేస్తుంది. కాగా ఈ భాగస్వామ్యంపై ర్యాపిడో కో ఫౌండర్ పవన్ గుంటుపల్లి సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ యాప్ లో మెట్రో టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం తీసుకురావడంతో ర్యాపిడో కస్టమర్లకు మరింత దగ్గరవుతామని అన్నారు. ప్రయాణికుల అవసరాల కోసం అన్ని రకాల సౌకర్యాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని.. నగర రవాణాలో నంబర్ వన్ గా ఉన్న హైదరాబాద్ మెట్రో రైలు విజయంలో భాగస్వామ్యం అవ్వడం గౌరవంగా ఉందని అన్నారు. ఇక హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాలను అందించడానికి అంకితభావంతో కృషి చేస్తున్నామని అన్నారు. ఇక ర్యాపిడో 65 వేల మంది కెప్టెన్లతో హైదరాబాద్ లో సుమాలు రెండు లక్షల రైడ్ లతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుంది. ఇప్పుడు మెట్రోతో భాగస్వామ్యం పొందడంతో ర్యాపిడో ప్రయాణికులకు మరింత ఎక్కువ సేవలు అందించనుంది.