P Krishna
Hyderabad Metro Rail: హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రజలకు ప్రయాణం వేగవంతం, సౌకర్యవంతంగా సేవలు అందిస్తుంది. మొదట నాగోల్- అమీర్ పేట్- మియాపూర్ మార్గంలో ప్రారంభించి.. తర్వాత పలు మార్గాలు విస్తరిస్తూ వస్తుంది.
Hyderabad Metro Rail: హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రజలకు ప్రయాణం వేగవంతం, సౌకర్యవంతంగా సేవలు అందిస్తుంది. మొదట నాగోల్- అమీర్ పేట్- మియాపూర్ మార్గంలో ప్రారంభించి.. తర్వాత పలు మార్గాలు విస్తరిస్తూ వస్తుంది.
P Krishna
భాగ్య నగరంలో రోజు రోజుకీ ట్రాఫిక్ పెరిగిపోతుంది. బస్సుల్లో ప్రయాణం చేసేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు మెట్రో సంస్థ ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే 2017 లో ప్రజలకు సౌకర్యవంతం, వేగవంతమైన ప్రయాణం కోసం మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. మొదట నాగోల్- అమీర్ పేట్- మియాపూర్ మార్గంతో ప్రారంభమై తర్వాత మరికొన్ని మార్గలు విస్తరిస్తూ వస్తున్నారు. మెట్రోలో ప్రతిరోజూ 4 లక్షలకు పైగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది. తాజాగా నగరంలో మెట్రో రైలు ఫేజ్ 2 పనులను ప్రారంభించేందుకు మెట్రో సంస్థ శ్రీకారం చుట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్. మెట్రో రైలు ఫేజ్ 2 పనులు ప్రారంభించేందుకు మెట్రో సంస్థ మొదలు పెట్టింది. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో మార్గాన్ని విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మియాపూర్ టూ ఎల్బీ నగర్ వరకు మాత్రమే మెట్రో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించేందుకు మెట్రో సంస్థ శ్రీకారం చుట్టింది. ఒక్కో కిలో మీటర్ కి అటూ..ఇటూ ఒక స్టేషన్ ఏర్పాటు చేసేందుక సిద్దమైంది. మరోవైపు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మీదుగా హైవే విస్తరణ పనులు షర వేగంగా జరుగుతున్నాయి. మరోపక్క ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు కూడా మొదలుపెట్టనున్నారు.
నగరంలో మెట్రో రెండో దశలో మొత్తం 70 కిలోమీటర్ల వరకు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే మొదట ఎల్బీ నగర్ – హయత్ నగర్ ని ఎంపిక చేశారు. ఎల్బీ నగర్ నుంచి చింతల్ కుంట, ఆటోనగర్, వనస్థలిపురం, మహవీర్ నేషనల్ పార్క్, హయత్ నగర్ వరకు అన్ని ఏరియాల్లో స్టేషన్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే స్టేషన్ పాయింట్ ఎక్కడ? స్టేషన్ల పేర్లు గురించి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులో వస్తే గంటల్లో ప్రయాణం వేగవంతం, సౌకర్య వంతంగా ఉంటుందని నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.