P Krishna
Metro Train to Old City: హైదరాబాద్ వాసుల చిరకాల స్వప్నం నెరవేరే సమయం వచ్చింది. మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Metro Train to Old City: హైదరాబాద్ వాసుల చిరకాల స్వప్నం నెరవేరే సమయం వచ్చింది. మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
P Krishna
తెలంగాణలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటు తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు పథకాల గ్యారెంటీ అమలుపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రెండు పథకాలు మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రారంభించారు. ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు ప్రజా పాలన అనే కార్యక్రమం ద్వారా స్వీకరిస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. పాతబస్తీ ప్రజలకు చిరకాల స్వప్నం నేరవేరబోతుంది.. మెట్రో పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లో మెట్రో విస్తరణ కు శ్రీకారం చుట్టబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిత్యం జనాలతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చేందుకు మెట్రో ట్రైన్ మంచి మార్గం. మూడు లైన్లుగా గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటికే మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెట్రో సేవలు మొదలైనప్పటి నుంచి విపరీతమైన స్పందన లభిస్తుంది. నిత్యం లక్షల్లో జనాలు ట్రావెల్ చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో 69 కిలోమీటర్ల పొడవు ఉన్న లైన్ మార్గాన్ని మొదటి దశ విస్తరణలో బాగంగా 74 కిలోమీటర్ల వరకు పెంచుతున్నారు. పాతబస్తీ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న కల నెరవేరబోతుంది. తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ తీసుకున్న నిర్ణయతో పాతబస్తీకి మోట్రో మోక్షం లభించబోతుంది.
జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న గ్రీన్ లైన్ మెట్రో మార్గాన్ని పాతబస్తీ మీదుగా ఫలక్ నూమా వరకు పొడిగించనున్నారు. ఈ మేరకు మార్చి 8న పాదబస్తీలో 5 కిలోమీటర్ల మెట్రో లైన్ నిర్మాణం ప్రాజెక్ట్ కు భూమి పూజ చేయనున్నట్లు మెట్రో రైల్ సంస్థ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే.. ఓల్డ్ సిటీ, ఫలక్ నూమా వైపు వెళ్లే ప్యాసింజర్స్ కు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండబోవని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి మెట్రో రైల్ పనులకు శంకుస్థాపన తేదీ ఖారారు కావడంతో పాతబస్తీ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్నికామెంట్స్ రూపంలో తెలియజేయండి.