Dharani
Met Gala 2024: ప్రపంచలోనే అతి పెద్ద ఫ్యాషన్ వేడుక మెట్ గాలాలో మెరిసిన ఓ మహిళ గురించి ఇప్పుడు నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకు ఎవరా సుధా రెడ్డి.. ఆమె బ్యాగ్రౌండ్ వివరాలు మీ కోసం..
Met Gala 2024: ప్రపంచలోనే అతి పెద్ద ఫ్యాషన్ వేడుక మెట్ గాలాలో మెరిసిన ఓ మహిళ గురించి ఇప్పుడు నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకు ఎవరా సుధా రెడ్డి.. ఆమె బ్యాగ్రౌండ్ వివరాలు మీ కోసం..
Dharani
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు హాజరయ్యే ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2024 న్యూయార్క్ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. మన దేశం నుంచే కాక.. విదేశాలకు చెందిన సెలబ్రిటీలు, సినీ తారలు గాలా రెడ్ కార్పెట్ మీద హోయలు పోవడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది మెట్ గాలా ఈవెంట్‌లో చీర కట్టులో దర్శనం ఇచ్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. సోషల్ మీడియా అంతా ఆమె ధరించిన చీర గురించే రచ్చ. అందమైన చీరలో అంతకంటే అందంగా కనిపించి.. చందమామతో పోటీ పడింది ఆలియా భట్. ఇక ఈ ఈవెంట్‌లో సినిమా తారలు మాత్రమే బిజినెస్ ప్రముఖులు కూడా హాజరవుతుంటారు. దానిలో భాగంగానే ఈషా అంబానీ.. ఈ షోలో తళుక్కున మెరిసింది. ఇక వీరిద్దరితో పాటు మరో భారతీయురాలు.. అందునా తెలుగు మహిళ గాలాలో సందడి చేసింది. ఆమె లుక్, దాని కోసం చేసిన ఖర్చు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఆ వివరాలు..
మెట్ గాలాలో మెరిసింది సుధారెడ్డి. ఇంతకు ఎవరీమె అంటే.. భారతీయ వ్యాపారవేత్త, మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గ్రూప్ డైరెక్టర్, మేఘా కృష్ణారెడ్డి భార్య. సుధారెడ్డి మెట్‌గాలా ఈవెంట్‌లో పాల్గొనడం ఇది రెండో సారి. ఇక ఈ ఏడాది గాలాలో వైట్ డ్రెస్‌లో వెన్నెలమ్మలా మెరిసింది సుధారెడ్డి. ఇక ఆమె ధరించిన డ్రెస్ కన్నా.. అందుకోసం ఆమె చేసిన ఖర్చు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
గాలా ఈవెంట్ కోసం ఆమె ఏకంగా 10 మిలియన్ డాలర్లు అంటే.. మన కరెన్సీలో చెప్పాలంటే 83 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈసారి ఆమె గాలాలో తరుణ్ తహ్లియాని డిజైన్ చేసిన దుస్తులు ధరించారు. దీంతో పాటు 180 క్యారెట్ల 30 సాలిటైర్‌లతో కూడిన నెక్లెస్‌ను ధరించి గ్రాండ్ లుక్‌లో మెరిసింది. సుధా రెడ్డి వద్ద ఉన్న పాతకాలపు చానెల్ బ్యాగ్ విలువ 33 లక్షలు. సుధా రెడ్డి పూర్తి లుక్ కోసం దాదాపు 10 మిలియన్లు అంటే 83 కోట్లు ఖర్చు చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
సుధా రెడ్డి ధరించిన డ్రెస్ కన్నా ఆమె వేసుకున్న ఆభరణాల ఖరీదు ఎక్కువ అంటున్నారు. 180 క్యారెట్ల డైమండ్ నెక్లెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఈ ఆభరణాల తయారీకి 100 గంటల సమయం పట్టిందట. దీనిలో కృష్ణ, సుధ ప్రేమకు గుర్తుగా నాలుగు పెద్ద, హార్డ్ ఆకారంలో ఉన్న వజ్రాలను పొదిగారు. అలానే ఫ్యామిలీపై ప్రేమను తెలిపేలా కుటుంబ వృక్షం కూడా ఉంది. ఈ నెక్లెస్‌లో అతిపెద్ద వజ్రం, 25 క్యారెట్ల కింగ్ ఆఫ్ హార్ట్స్, భర్త మేఘా కృష్ణారెడ్డికి ప్రతీకగా, క్వీన్ ఆఫ్ హార్ట్స్, 20 క్యారెట్ల హార్ట్‌షేప్డ్ వజ్రం సుధా రెడ్డిని సూచిస్తుంది. ఇంకా ప్రిన్స్ ఆఫ్ నాలెడ్జ్, ప్రిన్స్ ఆఫ్ ట్రెజర్స్ అని పిలువబడే రెండు 20 క్యారెట్ డైమండ్స్ కుమారులు ప్రణవ్, మానస్‌లను ప్రతిబింబిస్తూ దీన్ని తయారు చేశారు.
ఇక ఈ వేడుకలో ఆమె ధరించిన 23 క్యారెట్ల యెల్లో డైమండ్ రింగ్, రెడ్డీస్ స్వరోవ్స్కీ, పూల చేతులు, బ్యాగ్ ఇలా అన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈసందర్బంగా సుధారెడ్డి మాట్లాడుతూ రెడ్‌కార్పెట్‌పై నడిచి మన నగరానికి, దేశానికి గుర్తింపు తీసుకురావడం గర్వంగా ఉందని తెలిపారు.