P Krishna
VC Sajjanar: ఇటీవల హైదరాబాద్‌లో కొంతమంది విద్యార్థులు RTC బస్సులో ఫుట్ బోర్డుపై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై విద్యార్థి సంఘాలు, పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా స్పందించారు.
VC Sajjanar: ఇటీవల హైదరాబాద్‌లో కొంతమంది విద్యార్థులు RTC బస్సులో ఫుట్ బోర్డుపై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై విద్యార్థి సంఘాలు, పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా స్పందించారు.
P Krishna
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఒప్పుడు ఆర్టీసీ బస్సుల్లో 68 శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉంటే.. మహాలక్ష్మి పథకం తర్వాత అది వంద శాతానికి మించింది. దీంతో బస్సుల్లో మగవారు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కొంతమంది విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఫుట్ బోర్డుపై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోపై స్పందించిన టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ..‘బస్సులో కొంతమంది విద్యార్థులు ఫుట్ బోర్డ్ పై ప్రమాదకరమైన ప్రయాణం చేయడం మీడియా ద్వారా యాజమాన్యం దృష్టికి వచ్చింది. ఈ వీడియో చాలా బాధకరంగా అనిపించింది. రాష్ట్రంలో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల రద్దీ ఎక్కడ ఎక్కువగా తెలుసుకుంటాం. రద్దీకి అనుగుణంగా బస్సులను ఎప్పటికప్పుడు అధికారులు అందుబాటులో ఉంచుతారు. గతకొన్ని రోజులుగా పలు రూట్లలో విద్యార్థుల రద్దీ విపరీతంగా ఉంటున్న విషయం యాజమాన్యం దృష్టికి వచ్చిందని’ సజ్జనార్ అన్నారు. ఇటీవల ఉచిత ప్రయాణ సౌకర్యంతో బస్సుల్లో రద్దీ మరింత పెరిగిపోయింది.నిత్యం కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు సీట్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ ఇబ్బందులు తొలగించేందుకు తమకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక బస్సులు వేయాలని విద్యార్థులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఫుట్ బోర్డు ప్రయాణాలు చేయడం వల్ల ప్రయాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఫుట్ బోర్డు పట్టుకొని వేలాడుతూ ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ మేరకు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, పలువురు రాజకీయ నేతలు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కి లేఖలు రాస్తున్నారను. దీనిపై ఎండీ సజ్జనార్ సానుకూలంగా స్పందించారు. ఇకపై విద్యార్థులకు ఏ కష్టం లేకుండా చూస్తానని, రద్దీ ఉన్న మార్గాల్లో ఆర్టీసీ బస్సుల సంఖ్య మరింత ఎక్కువగా పెంచుతానని హామీ ఇచ్చారు. ఇకపై విద్యార్థులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు యాజమాన్యం కట్టుబడి ఉందని అన్నారు.
ప్రతిరోజూ లక్షలాది మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లోనే తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని వివరించారు. తమ వ్యక్తిగత భద్రతను దృష్టిలో పెట్టుకొని ఫుట్ బోర్డు ప్రయాణం చేయకుండా సహకరించాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక ట్విట్ చేశారు. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సజ్జనార్ ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ఎన్నోమార్లు ప్రయాణికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఎండీ సజ్జనార్ చేసిన ఈ ప్రకటనతో విద్యార్థులకు ఫుట్ బోర్డ్ ప్రయాణ కష్టాలు తీరనున్నట్లు తెలుస్తుంది. బస్సుల సంఖ్య పెంచితే విద్యార్థులు ప్రశాంతంగా సీట్లో కూర్చొని ప్రయాణం చేయవొచ్చని అంటున్నారు. దీని వల్ల విద్యార్థులకే కాదు సాధారణ ప్రయాణికులకు కూడా ఉపశమనం లభించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
#TGSRTC కి చెందిన ఒక బస్సులో కొందరు విద్యార్థులు ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తోన్న దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా యాజమాన్యం దృష్టికి వచ్చాయి. రాష్ట్రంలో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. రద్దీకి అనుగుణంగా బస్సులను ఎప్పటికప్పుడు ఆర్టీసీ అధికారులు… pic.twitter.com/mdaTzHxCl6
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) October 22, 2024