iDreamPost
android-app
ios-app

TGSRTCలో 3035 ఉద్యోగాలు.. దరఖాస్తుదారులకు సజ్జనార్ కీలక సూచన!

  • Published Jul 11, 2024 | 3:00 PM Updated Updated Jul 11, 2024 | 3:00 PM

MD Sajjanar is a Key Reference: ఈ మధ్య మోసగాళ్లు దేనికైనా తెగిస్తున్నారు. డబ్బు సంపాదన కోసం అమాయకులను దారుణంగా మోసం చేస్తున్నారు. ఉద్యోగ ప్రకటనలపై ఫేక్ లింక్స్ క్రియేట్ చేసి వ్యక్తితగ సమాచారం తెలుసుకొని మోసాలకు పాల్పపడుతున్నారు.

MD Sajjanar is a Key Reference: ఈ మధ్య మోసగాళ్లు దేనికైనా తెగిస్తున్నారు. డబ్బు సంపాదన కోసం అమాయకులను దారుణంగా మోసం చేస్తున్నారు. ఉద్యోగ ప్రకటనలపై ఫేక్ లింక్స్ క్రియేట్ చేసి వ్యక్తితగ సమాచారం తెలుసుకొని మోసాలకు పాల్పపడుతున్నారు.

TGSRTCలో 3035 ఉద్యోగాలు.. దరఖాస్తుదారులకు సజ్జనార్ కీలక సూచన!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు వరుసగా శుభవార్తలు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పిస్తామని తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో తెలిపారు. ఈ క్రమంలోనే వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకోసం కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రవాణా సైంస్థ(టీజీఎస్ఆర్టీసీ) లో ఖాళీగా ఉన్న 3,035 పోస్టుల భర్తీకి రేవంత్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఇటీవల సైబర్ మోసాలు జరుగుతున్న నేపథ్యంలో దరఖాస్తుదారులకు సజ్జనార్ కీలక సూచన చేశారు. వివరాల్లోకి వెళితే..

దేశంలో ఇటీవల సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అమాయకుల అవసరాలను కొంతమంది కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఇటీవల టీజీఎస్ ఆర్టీసీ లో ఖాళీగా ఉన్న 3,035 పోస్టుల భర్తీకి రేవంత్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డ్రైవర్ పోస్టులు 2000, 743 శ్రామిక్ పోస్టులు, 114 డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్), 84 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్), 25 డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు, 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్,11 సెక్షన్ ఆఫీసర్ (సివిల్), 7 మెడికల్ ఆఫీసర్ (జనరల్), 7 మెడికల్ ఆఫీసర్ (స్పెషాలిస్టు) జాబ్స్ ఉన్నాయి. తాజాగా టీజీఎస్‌ఆర్టీసీ‌లో ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక సూచన చేశారు.

ఇటీవల కొంతమంది ఆర్టీసీలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారిని మోసం చేస్తున్నారు. 3035 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని,ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింక్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని అస్సలు నమ్మోద్దు. ప్రస్తుతం నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ అయ్యింది.. దరఖాస్తు ప్రక్రియ ఇంకా మొదలు పెట్టుకోవద్దు. ఉద్యోగార్థుల అర్హతలు, దరఖాస్తు ఫీజు, తదితర వివరాలను అందులో పేర్కొన్నారు. అవన్నీ ఫేక్. ఆ లింక్ లను ఉద్యోగార్థులు నమ్మొద్దు. క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చెయొద్దని TGSRTC యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. ట్విట్టర్ వేధిక ద్వారా ఎండీ సజ్జనార్ ఉద్యోగార్థుల కీలక సూచన చేశారు.