Dharani
MATA Free IT Training: పేద విద్యార్థులను ఐటీ ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
MATA Free IT Training: పేద విద్యార్థులను ఐటీ ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాక.. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ.. పాలనలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఇక రాష్ట్ర ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ సర్కార్ తెలిపింది. అనడమే కాక ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే. త్వరలోనే డిజిటల్ హెల్త్ కార్డులను అందిస్తామని.. అప్పుడు రేషన్ కార్డుతో పని లేకుండా.. ఆరోగ్యశ్రీ సేవలు పొందవచ్చని తెలిపారు. అలానే విద్యార్థుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా పేద విద్యార్థులను ఐటీ ఉద్యోగులుగా మార్చేందుకు రేవంత్ సర్కార్ నడుం కట్టింది. ఆ వివరాలు..
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఐటీ ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ’మాటా‘తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుత టెక్నాలజీ రంగంలో జెనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ/ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డెవోప్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ యాప్ డెవలప్ మెంట్ వంటి అధునాతన సాంకేతికతలకు సంబంధించి పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం కోసం మాటా.. ముందుకు వచ్చింది.
ఈ నేపథ్యంలో.. రాబోయే ఐదేళ్ల పాటు తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత ఆన్‌లైన్ ఐటీ శిక్షణను అందించాలని మాటా నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అభినందించిన మంత్రి శ్రీధర్ బాబు.. మాటాతో కలిసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు.. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టీఏఎస్కే)తో ‘మాటా’ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా.. ప్రారంభ దశలో 1000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని మాటా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు సెప్టెంబర్ 2న కామారెడ్డి జిల్లాలో మొదటి బ్యాచ్ ప్రారంభించనున్నట్టు మాటా ప్రతినిధులు తెలిపారు.
గత ఏడాదిన్నర కాలంగా.. యువతకు ఐటీ శిక్షణ, ఆరోగ్య క్లినిక్‌లు, మెడికల్ క్యాంపులు, బ్లడ్ డోనేషన్ క్యాంపులు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, భారతీయ పండుగలతో సహా వివిధ కార్యక్రమాలను చురుకుగా అమలు చేస్తూ సమాజానికి.. ‘మాటా’ తనవంతు సేవ చేస్తోంది అన్నారు మంత్రి శ్రీధర్ బాబు.