Arjun Suravaram
Kamareddy District: ఓ వ్యక్తి డ్రాయర్ మీద పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. అంతేకాక తనకు జరుగుతున్న అన్యాయం గురించి..పోలీసులకు చెప్పుకున్నాడు. తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...
Kamareddy District: ఓ వ్యక్తి డ్రాయర్ మీద పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. అంతేకాక తనకు జరుగుతున్న అన్యాయం గురించి..పోలీసులకు చెప్పుకున్నాడు. తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...
Arjun Suravaram
సమాజంలో అనేక రకాల ఘటనలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే కొన్ని రకలా సంఘటనలు చూసినప్పుడు మాత్రం చాలా విచిత్రంగా అనిపిస్తాయి. అంతేకాక మరికొన్ని సందర్భాల్లో సమస్య అనుభవించే వాడికి నరకంగా ఉన్నా చూసే వారికి మాత్రం నవ్వు వస్తుంది. తాజాగా ఓ వ్యక్తి డ్రాయర్ మీద పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. అంతేకాక తనకు జరుగుతున్న అన్యాయం గురించి..పోలీసులకు చెప్పుకున్నాడు. తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. డ్రాయర్ లో అతడిని చూసిన స్థానికులు ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ అభిప్రాయపడుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
సాధారణంగా మహిళలపై మగవారు చేయి చేసుకోవడం, దాడులు చేయడం వంటి ఘటనలు చూశాం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య పురుషులు ఆధిపత్యంగా ఎక్కువగా సాగుతుందని చాలా మంది అభిప్రాయా పడుతుంటారు. ఎంతో మంది ఆడవాళ్లు తమ భర్తల వేధింపులకు తట్టుకోలేక నరకం అనుభవిస్తుంటారు. వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చాయి. దీంతో స్త్రీలపై దాడులు చాలా వరకు తగ్గాయి. పీకలదాకా తాగొచ్చి భార్యలను కొట్టే భర్తలపై.. వివిధ రకాల సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారు. ఒకవేళ అప్పటికీ దారికి రాకపోతే.. నీకూ నాకూ విడాకులు ఇచ్చేసి.. కొందరు మహిళలు స్వతంత్రంగా బతికేస్తున్నారు.
అయితే మనం చెప్పుకున్న విషయం అంతా నాణేనికి ఒకవైపు మాత్రం. మరోవైపు ఎంతో మంది భర్తలు కూడా భార్యల చేత వేధింపులకు గురవుతున్నారు. కానీ ఎక్కువ మంది బయటకు రావడం లేదు. చాలా అరుదుగా మాత్రమే భర్తల ఘటనలు బయటకు వస్తుంటాయి. అలానే ఇప్పుడు కూడా ఒకటి వెలుగులోకి వచ్చింది. తన భార్య రోజూ చితకబాదుతుందంటూ ఓ భర్త బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. మామూలుగా వెళ్లి.. ఫిర్యాదు చేస్తే.. పోలీసులు తన బాధ అర్థం చేసుకుంటారో లేదో అనుకున్నాడో ఏమో వినూత్నంగా తన బాధను వ్యక్తం చేశాడు. ఒంటి మీద దుస్తువులు లేకుండా కేవలం డ్రాయర్‌తో పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన బాధను పోలీసులకు చెప్పుకున్నాడు.
తన భార్య నుంచి తనను కాపాడాలంటూ ఆ బాధితుడు పోలీసులను ప్రార్థించాడు. తనను ప్రతిరోజూ కొడుతుందంటూ కన్నీరు పెడుతూ తన బాధలు చెప్పుకున్నాడు. అతడి బాధలు విన్న పోలీసులు కూడా ఆ దంపతులకు సర్ధి చెప్పి పంపించారు. నీ కష్టం పగోనికి కూడా రావొద్దు భయ్యా అంటూ ఆ బాధితుడిని చూసి పలువురు సానుభూతి ప్రకటించారు. అయితే అతడు ఎంతలా వేధిస్తే..ఆమె అలా రియాక్ట్ అయ్యి ఉంటుందని పలువురు ఆమెకు మద్ధతుగా మాట్లాడుతున్నారు.