iDreamPost
android-app
ios-app

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడి కాలేజీ భవనాలు కూల్చివేత

  • Published Mar 07, 2024 | 12:31 PM Updated Updated Mar 07, 2024 | 12:31 PM

Rajasekhar Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. ఆ వివరాలు..

Rajasekhar Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. ఆ వివరాలు..

  • Published Mar 07, 2024 | 12:31 PMUpdated Mar 07, 2024 | 12:31 PM
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడి కాలేజీ భవనాలు కూల్చివేత

మాజీ మంత్రి మల్లారెడ్డికి తెలంగాణ సర్కార్‌ భారీ షాక్‌ ఇచ్చింది. ఆయన అల్లుడు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన కాలేజీ భవనాలను అధికారులు తాజాగా కూల్చి వేశారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు.. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజేశఖర్‌రెడ్డికి దుండిగల్‌లోని చిన్న దామరచెరువు ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌లో కాలేజీలు ఉన్నాయి. ఐఏఆర్‌ఈ, ఎంఎల్‌ఆర్‌ఐటీఎం కాలేజీ బిల్డింగ్‌లు ఇక్కడ ఉన్నాయి. అయితే రాజశేఖర్‌రెడ్డి.. మొత్తం 8.24 ఎకరాల చెరువును అనగా.. ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌ను ఆక్రమించి.. పార్కింగ్‌ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలోనే నోటీసులు జారీ చేశారు. ఇక తాజాగా వారం రోజుల క్రితం యాజమాన్యానికి కూడా నోటీసులు జారీ చేశారు.

అయితే దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో.. తాజాగా మేడ్చల్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. అయితే కాలేజీ యాజమాన్యం, కొందరు విద్యార్థులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో అధికారులు వారికి సర్ది చెబుతున్నారు. ఇటు భవనాల కూల్చివేత జరుగుతుండగానే.. మరోవైపు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిపై అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో అధికార పార్టీ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ.. అల్వాల్‌ పురపాలక కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొందరు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ధర్నాకు దిగారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంతేకాక ఎమ్మెల్యే, కొందరు బీఆర్‌ఎస్‌ నేతలు మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలు తన వాహనాన్ని అడ్డుకున్నారని.. విధులకు ఆటంకం కలిగించారని పోలీసులుకు ఫిర్యాదు చేశాడు శ్రీనివాస్‌ రెడ్డి. డీసీ కంప్లైంట్‌ మేరకు ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. తాను ఎవరిని బెదిరించలేదని.. వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టలేదని చెప్పుకొచ్చారు. కాలేజీ బిల్డింగ్‌ల కూల్చివేత వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి దీనిపై మల్లారెడ్డి ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet