Somesekhar
ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే, పోలీసులతో కలిసి కాపలా కాశారు. ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? దానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే, పోలీసులతో కలిసి కాపలా కాశారు. ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? దానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Somesekhar
అది నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణం.. స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పోలీసులతో కలిసి రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2.40 గంటల వరకు కర్రలు పట్టుకుని పోలీసులతో సహా గస్తీలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమస్యలను తీర్చడానికి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధిగా తన విధి నిర్వహిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. మరి ఇంతకీ ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే, పోలీసులతో కలిసి కాపలా కాయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? దానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ప్రజలను దోచుకుంటూ.. భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. గత 20 రోజులుగా మక్తల్ పట్టణాన్ని లక్ష్యాంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు. 15 రోజుల కింద ఓ ఇంట్లో దొంగతనం చేసిన దొంగలు.. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే ఆయుధాలతో తల్లీ, కూతుర్లను బెదిరించి రూ. 5 లక్షలు దోచుకెళ్లారు. ఇంతటీతో ఆగకుండా బైక్ పై వెళ్తున్న వ్యక్తిని అడ్డుకుని అతడి గొంతుకు తాడు బిగించి.. అతడి నుంచి రూ. 30 వేలు దోచుకెళ్లారు.
కాగా.. ఈ సంఘటన ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసింది. దీంతో దొంగల భయంతో కాలనీల్లో యువకులు కర్రలు పట్టుకుని గస్తీ కాస్తున్నారు. ఇటు పోలీసులు సైతం పెట్రోలింగ్ చేస్తున్నారు. వారితో పాటుగా తాను గస్తీ కాస్తానంటూ ముందుకు వచ్చారు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. పోలీసులతో పాటుగా రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు గస్తీ కాశారు. ప్రజల్లో భయాందోళనలు తొలగించడానికి ప్రయత్నం చేశారు. కాగా.. ఎవరైనా అనుమానస్పదంగా తిరిగితే తమకు వెంటనే సమాచారం అందించాలని పోలీసులు పేర్కొన్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మరి ఎమ్మెల్యే గస్తీ కాయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.