iDreamPost
android-app
ios-app

Free Journey: ఉచిత ప్రయాణం ఎఫెక్ట్.. పల్లెవెలుగు బస్సులో 182 మంది ప్రయాణికులు.. టైర్ల నుంచి పొగలు!

  • Published Dec 15, 2023 | 12:20 PM Updated Updated Dec 15, 2023 | 12:20 PM

ప్రస్తుతం తెలంగాణలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అమలవుతోంది. ఈ క్రమంలో ఓ చోట పల్లెవెలుగు బస్‌లో ఏకంగా 182 మంది ప్రయాణించారు.. ఆ తర్వాత ఏం జరిగింది అంటే..

ప్రస్తుతం తెలంగాణలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అమలవుతోంది. ఈ క్రమంలో ఓ చోట పల్లెవెలుగు బస్‌లో ఏకంగా 182 మంది ప్రయాణించారు.. ఆ తర్వాత ఏం జరిగింది అంటే..

  • Published Dec 15, 2023 | 12:20 PMUpdated Dec 15, 2023 | 12:20 PM
Free Journey: ఉచిత ప్రయాణం ఎఫెక్ట్.. పల్లెవెలుగు బస్సులో 182 మంది ప్రయాణికులు.. టైర్ల నుంచి పొగలు!

అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. మహిళల కోసం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీలో ఉచిత జర్నీ, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తోంది. వారం రోజుల పాటు ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా రాష్ట్రంలో ఉన్న మహిళలంతా తెలంగాణవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఇక నెటి నుంచి అనగా డిసెంబర్‌ 17 నుంచి ఉచిత ప్రయాణం చేయాలంటే స్థానికతను నిరూపించే గుర్తింపు కార్డు కచ్చితంగా ఉండాలని ప్రకటించారు. నేటి నుంచి జీరో టికెట్లు అమల్లోకి వస్తున్నాయి.

మహాలక్ష్మి పథకం అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడంతో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక చోట పల్లెవెలుగు బస్సులో ఏకంగా 182 మంది ప్రయాణికులను ఎక్కించుకుని ప్రయాణించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడలో పల్లె వెలుగు బస్సులో 182 మంది ప్రయాణించారు. దీంతో ఆ బస్సు టైర్ల నుంచి పొగలు వచ్చాయి. అది గుర్తించిన వెంటనే బస్ డ్రైవర్ బస్సును ఆపేశాడు. ప్రస్తుతం ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వ

మహబూబ్‌నగర్ డిపోకు చెందిన టీఎస్ 06 యూపీ 3411 నంబరు గల పల్లె వెలుగు బస్సు బుధవారం ఉదయం మహబూబ్ నగర్ నుంచి నారాయణపేటకు బయల్దేరింది. మహిళలకు ఉచిత జర్నీ అమల్లో ఉండటంతో.. ఏకంగా 182 మంది ప్రయాణికులు బస్సులో ఎక్కారు. మార్గమధ్యలో జేపీఎన్‌సీఈ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద బస్సు నుంచి దాదాపు 30 నుంచి 40 మంది విద్యార్థులు దిగారు. ఆ తర్వాత మరికొందరు మహిళలు బస్సు ఎక్కారు.

కెపాసిటీకి మించి ప్రయాణికులు బస్సు ఎక్కడంతో ఓవర్ లోడ్ అయింది. దీంతో మరికల్ వద్దకు వెళ్లిన తర్వాత వెనుక టైర్ల నుంచి పొగలు రావడం ప్రారంభం అయింది. ఓవర్ లోడ్‌ కారణంగా ధన్వాడ చేరుకోగానే పొగ ఎక్కవై కాలిన వాసన రావడాన్ని ప్రయాణికులు గుర్తించి డ్రైవర్, కండక్టర్‌లకు సమాచారం అందించారు. దీంతో డ్రైవర్‌ అప్రమత్తమై బస్సును అక్కడే ఆపి.. అందులో ఉన్న ప్రయాణికులను ఇతర బస్సుల్లో పంపించారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.