భారీ వర్షాలు.. రైల్వే స్టేషన్‌లో పిల్లల, ప్రయాణికుల ఆకలి తీర్చిన మహబూబాబాద్ పోలీసులు!

Mahabubabad district police helped people: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా... ప్రజలంతా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటున్నారో చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో అధికారులంతా ప్రజలను అపప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఓ జిల్లాలోని పోలీసులు తమ కర్తవ్యంతో పాటు మంచి మనసుని చాటుకుని.. అందరి ప్రశంసలు పొందుతున్నారు.

Mahabubabad district police helped people: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా... ప్రజలంతా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటున్నారో చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో అధికారులంతా ప్రజలను అపప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఓ జిల్లాలోని పోలీసులు తమ కర్తవ్యంతో పాటు మంచి మనసుని చాటుకుని.. అందరి ప్రశంసలు పొందుతున్నారు.

నిన్నటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడపతెరపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఎక్కెడికక్కడ ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. బస్టాండ్ లు , రైల్వే స్టేషన్ లో అన్ని నీటితో నిండిపోయాయి. అకస్మాత్తుగా పడుతున్న ఈ వర్షాల కారణంగా.. బస్సులలో , రైళ్లలో ప్రయాణం చేసే ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ లో చిక్కుకుపోయిన ప్రజల పట్ల… పోలీసు యంత్రాంగం తమ భాధ్యతను నిర్వర్తించడమే కాకుండా.. మంచి మనసు చాటుకుని అందరి చేత ప్రశంసలు పొందుతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలతో పాటు బస్సు స్టాండ్ లు , రైల్వే స్టేషన్ లు కూడా మునిగిపోయిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి అప్ డేట్స్ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో తెలంగాణలోని.. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం రైల్వే స్టేషన్ లో వరద నీరు కారణంగా.. రైల్వే ట్రాక్ క్రింద ఉన్న కంకర కొంతభాగం కొట్టుకుపోయింది. ఇక పలు రైళ్లు అక్కడిక్కడే నిలిచిపోయాయి. దీనితో ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో.. అక్కడ ఉన్న ఏరియా రూరల్ సీఐ సరవయ్య, కేసముద్రం ఎస్.ఐ మురళీధర్.. ఇక మిగిలిన పోలీసులు ప్రజలు ఇబ్బంది పడకుండా.. అక్కడ వారికి ఆహారంతో పాటు వాటర్ బాటిల్స్, బిస్కట్ పాకెట్స్ లను అందించి మంచి మనసు చాటుకున్నారు. ఈ కారణంగా డిజిపి శ్రీ జితేందర్ వారిని అభినందించారు. ఆ సమయంలో కూడా ప్రజలఆకలి తీర్చి సెల్యూట్ అనిపించుకున్నారు పోలీసులు.

వానొచ్చిన వరదొచ్చినా ఎలాంటి ముప్పు వచ్చినా కానీ తమని తాము పట్టించుకోకుండా…తమ కర్తవ్యానికి గౌరవం ఇచ్చి.. ప్రజా సేవ చేసే వారిలో పోలీసులు ఎప్పుడు ముందుటారు. అందులోను ఇలా కేవలం భాద్యతను మాత్రమే కాకుండా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రజల ఆకలి గురించి, ఇబ్బందుల గురించి ఆలోచించే పోలీసులు చాలా అరుదుగా ఉంటూ ఉంటారు. అలంటి వారిలో మహబూబాబాద్ పోలిసులు కూడా ఒకరు. కాబట్టి ప్రజలంతా కూడా ఇలాంటి ఆపత్కర పరిస్థితుల్లో పోలీసులకు సహకరించి.. వారు చెప్పిన ఆదేశాలను పాటిస్తూ.. ఇళ్ల వద్దనే ఉండడం మంచిది. రానున్న 24 గంటలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మరింత అపప్రమత్తంగా ఉండాలి. మరి మహబూబాబాద్ జిల్లా పోలీసులు చేసినై మంచి పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments