iDreamPost
android-app
ios-app

Hyderabad: ఇంత దారుణమా.. పెంపుడు కుక్క ఇంట్లోకి వచ్చిందని కర్రలతో దాడి

  • Published May 16, 2024 | 12:08 PM Updated Updated May 16, 2024 | 12:08 PM

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. పెంపుడు కుక్క కారణంగా రాజుకున్న గొడవ ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ వివరాలు..

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. పెంపుడు కుక్క కారణంగా రాజుకున్న గొడవ ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ వివరాలు..

  • Published May 16, 2024 | 12:08 PMUpdated May 16, 2024 | 12:08 PM
Hyderabad: ఇంత దారుణమా.. పెంపుడు కుక్క ఇంట్లోకి వచ్చిందని కర్రలతో దాడి

కొందరు మనుషులు ఎంత దారుణంగా తయారవుతున్నారంటే.. చిన్న చిన్న విషయాలకే దారుణాలకు తెగ బడుతున్నారు. ఎప్పుడో ఏళ్ల క్రితం జరిగిన గొడవలను మనసులో పెట్టుకుని.. అదును చూసి పగ తీర్చుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ తరహా దారుణాలు పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం గచ్చిబౌలిలో ఓ యువకుడు హోటల్‌ యజమానిపై దాడి చేసి కిరాతకంగా హతమర్చాడు. కారణం ఏడాది క్రితం జరిగిన ఓ గొడవను మనసులో పెట్టుకుని.. ఇప్పుడిలా పగ తీర్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సంచలనంగా మారాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగు చూసింది. పెంపుడు కుక్క ఇంట్లోకి వచ్చిందని చెప్పి.. దాని యజమాని, అతడి భార్యపై అత్యంత దారుణంగా దాడి చేశారు కొందరు యువకులు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

హైదరాబాద్‌ మధురానగర్‌లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కుక్క ఇంట్లోకి వచ్చిందనే కారణంతో ఓ యువకుడు.. తన స్నేహితులతో కలిసి.. దాని యజమానిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డు వచ్చిన భార్య, అతడి కుటుంబ సభ్యులను చితకబాదారు. కుక్కపై కూడా కర్కశంగా దాడి చేశారు. సీసీటీవీలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డు కావడంతో.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన వారు.. నిందుతుడు ఏదో పాత పగలు మనసులో పెట్టుకుని ఇలా దాడి చేసి ఉంటాడని కామెంట్స్‌ చేస్తున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్‌, రహమత్ నగర్‌లో ఉండే శ్రీనాథ్ అనే వ్యక్తి ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే ఇటీవల ఆ కుక్క బెల్ట్ తెంపుకొని ఎదురుగా ఉన్న ధనుంజయ్ అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లింది. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. కుక్కను పెంచడమే కాదు వేరే వాళ్లకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలంటూ ధనుజంయ్‌.. శ్రీనాథ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత గొడవ సద్దుమణిగినా.. ధనుంజయ్‌ మాత్రం దాన్ని మర్చిపోలేదు. మనసులో పెట్టుకుని శ్రీకాంత్‌ మీద పగ పెంచుకున్నాడు.

ఇలా ఉండగా.. ఈనెల 14న అనగా మంగళవారం నాడు శ్రీనాథ్ తన పెంపుడు కుక్కను తీసుకొని బయటకు వాకింగ్‌కు వెళ్లాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ధనంజయ్ శ్రీనాథ్‌ను కవ్వించాడు. అనంతరం అతనిపై దాడి చేశాడు. ఈ దాడిలో అతని స్నేహితులు కూడా పాల్గొన్నారు. మెుత్తం ఐదురురు యువకులు కలిసి కర్రలతో శ్రీనాథ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. అతడి ఆర్తనాదాలు విని బయటకు వచ్చిన శ్రీనాథ్‌ భార్య అతడిని కాపాడే ప్రయత్నం చేసింది. అయినా ధనుజంయ్‌, అతడి స్నేహితులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. శ్రీనాథ్‌, అతడి భార్యపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు.

యజమానిపై దాడి చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేసిన కుక్కపైనా దాడికి పాల్పడ్డారు నిందితులు. ఈ ఘటనలో శ్రీనాథ్, అతని భార్యతో పాటు కుక్క కూడా తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. శ్రీనాథ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet