iDreamPost
android-app
ios-app

వరంగల్ ప్రేమ వ్యవహారం ఘటన.. వీడియో విడుదల చేసిన యువతి!

  • Published Jul 05, 2023 | 6:26 PM Updated Updated Jul 05, 2023 | 6:26 PM
  • Published Jul 05, 2023 | 6:26 PMUpdated Jul 05, 2023 | 6:26 PM
వరంగల్ ప్రేమ వ్యవహారం ఘటన.. వీడియో విడుదల చేసిన యువతి!

వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఇటుకాలపల్లికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన సర్పంచ్ కూతురిని ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నా పరువు తీశారంటూ యువకుడిపై కోపం పెంచుకున్నాడు యువతి తండ్రి సర్పంచ్. ఇక ఆగ్రహంతో దారుణానికి ఒడిగట్టాడు. యువకుడు, అతడి స్నేహితుల ఇళ్లకు నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో వారి ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో ఆ బాధితుడు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో వారి గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామస్తులు స్పందించి నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు.

అయితే సర్పంచ్ వ్యవహారంపై ఆయన కూతురు కావ్యశ్రీ స్పందించి తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో ఏముందంటే?.. ‘‘మమ్మి, డాడీ.. నా ఇష్టపూర్వకంగానే తనతో పాటు బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నాను. నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టలేదు. దయచేసి నా వల్ల ఇబ్బందిపడి ఎవరినీ ఇబ్బంది పెట్టకండి. నేను తనతో సంతోషంగానే ఉన్నా.. ఇకపై కూడా హ్యాపీగానే ఉంటా. నా కోసం మీరు బాధపడి ఎక్కడ వెతకొద్దు. ఒకవేళ నేను ఎవరినైన ఇబ్బంది పెట్టినట్లు అయితే మేము చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇకపై మీరు సంతోషంగా ఉండి, మమ్మల్నీ హ్యాపీగా ఉంచండి’’ అంటూ యువతి కావ్యశ్రీ తెలిపింది. ఇదే వీడియో ఇప్పుడు కాస్త వైరల్ గా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet