iDreamPost
android-app
ios-app

పట్టణాలకు ఆదర్శంగా నిలిచిన తండా.. అక్కడ 100 శాతం ఓటింగ్

ఇటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరిగాయి. అటు తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ ముగిసింది. కానీ పట్నాలతో పోలిస్తే.. పల్లెటూళ్లు, గ్రామాల్లో పోలింగ్ శాతం ఎక్కువ నమోదైంది.

ఇటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరిగాయి. అటు తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ ముగిసింది. కానీ పట్నాలతో పోలిస్తే.. పల్లెటూళ్లు, గ్రామాల్లో పోలింగ్ శాతం ఎక్కువ నమోదైంది.

పట్టణాలకు ఆదర్శంగా నిలిచిన తండా.. అక్కడ 100 శాతం ఓటింగ్

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల వేడి కొనసాగుతుంది. ఏడు దశల్లో భాగంగా ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తయ్యింది. ఇంకా మూడు దశల పోలింగ్ మిగిలి ఉంది. కాగా, మే 13న తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల హడావుడి ముగిసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి. ఇటు తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యాయి. కాగా, ఇరు రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. ప్రస్తుతం ఈవీఎంలో మిషన్లలో అభ్యర్థుల భవితవ్యం దాగి ఉంది. వీటి భవితవ్యం జూన్ 4న తేలనుంది. ఇదిలా ఉంటే.. ఏపీలో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణలో 64.63 శాతం పోలింగ్ నమోదైంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటికీ.. సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఓట్లు వేసేందుకు బారులు తీరారు. ఇదిలా ఉంటే తెలంగాణలోని కొన్ని నగరాల్లో కన్నా, కొన్ని కుగ్రామాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించేందుకు తండోపతండాలుగా వెళ్లారు. ఓ తండా ప్రాంతం మొత్తం వంద శాతం పోలింగ్ నమోదు చేసి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. మే 13న తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు, కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల జరిగింది. అర్థరాత్రి వరకు ఇక్కడ పోలింగ్ జరిగింది. పట్టణాల్లో కంటే పల్లెల్లోనే ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. మహానగరమైన హైదరాబాద్‌లో అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదు కావడం గమనార్హం.

కాగా,  కొంత మంది ఎన్నికల రోజున సెలవు అయినప్పటికీ.. ఓటు వేసేందుకు వెనకాడారు. అన్నీ సదుపాయాలు ఉన్నప్పటికీ నగర ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపలేదు. కానీ సరైన పదుపాయాలు లేని ఓ కుగ్రామం.. 100 శాతం ఓటింగ్ పర్సెంటేజీతో పట్టణాలకు ఆదర్శంగా నిలిచింది. ఇంతకు ఆ గ్రామం ఎక్కడ ఉందంటే..? మెదక్‌ జిల్లాలో. కొల్చారం మండలం సంగాయిపేట తండాలో 100 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ ఓటు హక్కును ఉన్న ప్రతి ఒక్కరు.. తమ ఓటును వినియోగించుకోవడం విశేషం. దీంతో అక్కడ సెంట్ పర్సెంట్ పోలింగ్ జరిగింది. ఆ తండాలో మెుత్తం ఓట్లు 210 కాగా.. ప్రతి ఒక్కరు ఓటు వేశారు. 115 మంది పురుషులు, 95 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఓటు విలువ తెలిసి.. తండాలోని ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుని పట్నాలకు మేలు కొలుపుగా నిలిచారు ఆ తండా ప్రాంత వాసులు. ఇది కదా నిజమైన ప్రజా చైతన్యం.