iDreamPost

Elections 2024: పోలింగ్‌ సిబ్బందిపై పోలీసుల లాఠీఛార్జ్‌.. తెలుగు రాష్ట్రాల్లోనే

  • Published May 14, 2024 | 8:32 AMUpdated May 14, 2024 | 8:32 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఏపీలో అక్కడకక్కడ కొన్ని ప్రాంతాల్లో మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఇక ఓ చోట మాత్రం పోలింగ్‌ సిబ్బందిపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఆ వివరాలు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఏపీలో అక్కడకక్కడ కొన్ని ప్రాంతాల్లో మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఇక ఓ చోట మాత్రం పోలింగ్‌ సిబ్బందిపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఆ వివరాలు..

  • Published May 14, 2024 | 8:32 AMUpdated May 14, 2024 | 8:32 AM
Elections 2024: పోలింగ్‌ సిబ్బందిపై పోలీసుల లాఠీఛార్జ్‌.. తెలుగు రాష్ట్రాల్లోనే

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. గతంతో పోలిస్తే.. ఈసారి భారీగా పోలింగ్‌ జరిగింది. ఓటర్లు పోటేత్తారు. కొన్ని ప్రాంతాల్లో అర్థరాత్రి వరకు కూడా పోలింగ్‌ కొనసాగింది. సోమవారం నాడు ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు పోలింగ్‌ జరగ్గా.. తెలంగాణలో మాత్రం కేవలం పార్లమెంట్‌ ఎన్నికలు జరిగాయి. దేశవ్యాప్తంగా సోమవారం నాలుగో దశ పోలింగ్‌ జరిగింది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇక తెలంగాణలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత.. ఊహించని సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద గొడవ చేసే వారిపై పోలీసులు లాఠీ ఝుళిపిస్తారు. కానీ ఓ చోట మాత్రం అందుకు భిన్నమైన సంఘటన చోటు చేసుకుంది. పోలింగ్‌ సిబ్బందిపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే చోటు చేసుకోవడం గమనార్హం. అసలేం జరిగిందంటే..

ఈ సంఘటన తెలంగాణ నారాయణఖేడ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక్కడ పోలింగ్‌ విధులు నిర్వహించిన సిబ్బందిపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. అసలేం జరిగిందంటే.. నారాయణఖేడ్‌లోని పలు ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత.. వారికి రావాల్సినన్ని డబ్బులు ఇవ్వడం లేదని.. తక్కువగా ఇస్తున్నారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ ముగిసింది.. ఈవీఎం మెషీన్లను భద్రం చేయాల్సి ఉంది. పోలీసులు ఆ హడావుడిలో ఉండగా.. ఇలా ఉపాధ్యాయులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగంలోకి దిగి.. వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు.

అయినా ఉపాధ్యాయులు వినకపోవడంతో.. పరిస్థితి చేయి దాటి పోయింది. దాంతో అసహనానికి గురైన పోలీసులు.. సిబ్బందిపై లాఠీఛార్జ్‌ చేశారు. దాంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారిపోయింది. ఈ పరిణామంతో పోలీసులు ఆందోళన విరమించినప్పటికీ.. తమకు రావాల్సిన డబ్బుల కోసం నిరసన తెలిపితే.. పోలీసులు వారిపై లాఠీఛార్జ్‌ చేయడాన్ని ఉపాధ్యాయులు తీవ్రంగా ఖండించారు. కానీ ఈ ఘటన మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి