Barrelakka: బర్రెలక్క నాగర్‌ కర్నూల్‌నే ఎందుకు ఎంచుకున్నారు.. ఆమె ఏం చెప్పిందంటే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగి సంచలనం సృష్టించిన బర్రెలక్క.. ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ నుంచి బరిలో దిగుతుంది. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగి సంచలనం సృష్టించిన బర్రెలక్క.. ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ నుంచి బరిలో దిగుతుంది. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు...

బర్రెలక్క అలియాస్‌ శిరీష.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఈమె కేవలం సోషల్‌ మీడియాను ఫాలో అయ్యే వారికి మాత్రమే తెలుసు. అయితే ఎప్పుడైతే బర్రెలక్క.. అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిందో.. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగింది. నిరుద్యోగుల సమస్యపై గళం ఎత్తిన ఆమెకు.. యువతతో పాటు మాజీ జేడీ లక్ష్మీనారాయణ, వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ లాంటి ప్రముఖులు కూడా ఆమెకు మద్దతిచ్చారు.

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క ఓడిపోయినా సరే.. బాగానే ప్రభావం చూపగలిగింది. ఆమె 5,598 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచారు. అయితే తన ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదని.. లోక్‌కసభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని గతంలోనే చెప్పుకొచ్చింది శిరీష. అన్నట్లుగానే.. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తుంది బర్రెలక్క. నాగర్‌కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసింది బర్రెలక్క.

అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క కొల్లాపూర్‌ నుంచి బరిలో దిగింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడంతో ఆమె ఎక్కడి నుంచి బరిలో దిగుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో బర్రెలక్క.. నాగర్‌కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. అయితే ఆమె ఇక్కడ నుంచే ఎందుకు పోటీ చేస్తుంది అనే దానిపై తాజాగా ఆమె స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేసింది.

‘‘ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా నేను.. ముందు నేను మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేద్దామని భావించాను. కానీ తర్వాత నాగర్‌ కర్నూల్‌ నుంచి బరిలో దిగుతున్నాను. ఎందుకంటే.. ఈ ప్రాంతం గురించి నాకు పూర్తిగా తెలుసు. ఇక్కడి పరిస్థితులపై నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. అందుకే పార్లమెంట్‌ ఎన్నికల కోసం.. నాగర్‌ కర్నూల్‌ని ఎంచుకున్నాను’’ అని చెప్పుకొచ్చింది శిరీష.

ఇక కొన్ని రోజుల క్రితమే శిరీష వివాహం బంధంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే తన భర్తకు కూడా రాజకీయాలంటే చాలా ఆసక్తి అని.. తనను పాలిటిక్స్‌లో ప్రోత్సాహిస్తున్నారని చెప్పుకొచ్చింది.. గెలుపు, ఓటమిలతో సంబంధం లేకుండా.. ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటాను అన్నాది. ‘‘ఇక అసెంబ్లీ ఎన్నికల వేళ నాకు భారీగా ఫండ్స్‌ వచ్చాయని అలానే నా వ్యక్తిగత జీవితం గురించి కూడా కొందరు అనేక విమర్శలు చేశారు. తప్పుడు ఆరోపణలు చేశారు. కానీ అవన్నీ ఫేక్‌ వార్తలే. ఇక ప్రస్తుతం నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు పోటీ పరీక్షల కోసం ప్రిపేరవుతూ.. రాత్రిళ్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది శిరీష అలియాస్‌ బర్రెలక్క.

Show comments