iDreamPost
android-app
ios-app

పిల్లల కిడ్నాప్? అనుమానంతో యువకుడిని చితకబాదిన స్థానికులు!

  • Published Mar 01, 2024 | 5:09 PM Updated Updated Mar 01, 2024 | 5:09 PM

People Who Beat the Child Kidnapper: డబ్బు సంపాదన కోసం ఎలాంది దారుణాలకైనా పాల్పడుతున్నారు. మానవ అక్రమ రవాణా చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.

People Who Beat the Child Kidnapper: డబ్బు సంపాదన కోసం ఎలాంది దారుణాలకైనా పాల్పడుతున్నారు. మానవ అక్రమ రవాణా చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.

పిల్లల కిడ్నాప్? అనుమానంతో యువకుడిని చితకబాదిన స్థానికులు!

ఈ మధ్య కాలంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఎన్నో అన్యాయాలు, అక్రమాలకు తెగబడుతున్నారు. ఇందుకోసం కొంతమంది కేటుగాళ్లు ఒంటరి మహిళలపై బంగారం లాక్కెళ్లడం (చైన్ స్నాచింగ్), అమాయకులకు మాయమాటలు చెప్పి అందినంత దోచుకోండం, మోసపూరిత స్కీమ్స్, దొంగతనాలు, కిడ్నాపులు ఇలా ఎన్నో రకాల నేరాలకు పాల్పపడుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో  కొంతమంది గ్రూపులుగా ఏర్పడి ఒంటరిగా ఉన్న పిల్లలను ఎత్తుకెళ్లి ఇతర రాష్ట్రాల్లో అమ్ముతూ డబ్బు సంపాదించుకుంటున్నారు. తాజాగా నిర్మల్ లో ఓ యువకుడు అనుమానస్పదంగా తిరగడంతో అక్కడ మహిళలు పట్టుకొని దేహశుద్ది చేశారు.

నిర్మల్ జిల్లా మంజులాపూర్ లో శివారు ప్రాంతంలో ఓ యువకుడు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. స్థానికులు అతన్ని ఎవరు నువ్వు.. ఎక్కడ నుంచి వచ్చావు అని ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పడంతో కొంతమంది మహిళలు అతన్ని పట్టుకొని దేహశుద్ది చేశారు. పిల్లలను ఎత్తుకువెళ్లే ముఠా సభ్యుడిగా అనుమానిస్తూ కొట్టడం ప్రారంభించారు. ఆ యువకుడు చాలా సేపు ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. అతని జేబు నుంచి కొన్ని దారాలు కింద పడ్డాయి. ఈ ధారాలు ఏంటీ? వాటితో ఏం చేస్తావు? పిల్లకు మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్తావా అంటూ మహిళలు, పురుషులు కలిసి కొట్టారు. ఆ యువకుడు తన కొడుకు కోసం ఇక్కడికి వచ్చానని.. తనకు ఏమీ తెలియదని.. తాను ఏ తప్పు చేయలేదని అన్నాడు. స్థానికులు పోలీసులు వచ్చేవరకు అతన్ని అక్కడే ఉండాలాని చెప్పారు. ఈ తతంగానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి వారిని అమ్ముకొని క్యాష్ చేసుకుంటున్న ముఠాలు పలు ప్రాంతాలల్లో తిరుగుతున్నాయి. పోలీసులు సైతం పిల్లలను ఒంటరిగా ఎక్కడ వదలకూడదని హెచ్చరిస్తున్నారు. స్కూల్ కి వెళ్లే పిల్లలను జాగ్రత్తగా ఇంటికి వచ్చే వరకు వారికి ఏదో ఒక రకంగా రక్షణ కల్పించాలని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన వాళ్లు.. ప్రజలు ఇలా చైతన్యవంతంగా ఉంటే పోలీసులకి కష్టం తగ్గించొచ్చు. కన్నవారి కడుపుకోత తగ్గించొచ్చు. ఈ మధ్య చిన్న పిల్లల అక్రమ రవాణా ఎక్కువ ఉంది.. అనుమానం వచ్చిన వాళ్లకు ఇలా దేహశుద్ది చేస్తే అసలు నేరస్థులు బయటకు వస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.