iDreamPost

మరి కొన్ని గంటల్లో వైన్స్ బంద్.. మరో 3 రోజులు చుక్క కూడా దొరకదు

Wines Shops will be Closed: తెలంగాణలో సోమవారం 13న లోక్ సభ ఎన్నిక జరగబోతుంది.. ఈరోజు 6 గంటలతో ఎన్నికల ప్రచారానికి పులిస్టాప్ పడింది. ఈ క్రమంలో వైన్స్ షాపులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Wines Shops will be Closed: తెలంగాణలో సోమవారం 13న లోక్ సభ ఎన్నిక జరగబోతుంది.. ఈరోజు 6 గంటలతో ఎన్నికల ప్రచారానికి పులిస్టాప్ పడింది. ఈ క్రమంలో వైన్స్ షాపులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

మరి కొన్ని గంటల్లో వైన్స్ బంద్.. మరో 3 రోజులు చుక్క కూడా దొరకదు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార పర్వం తుది దశకు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ప్రచారానికి పులిస్టాప్ పడనుంది. ఎక్కడిక్కడ మైకులు బంద్ కాబోతున్నాయి. చివరి గంటలు పార్టీలకు కీలకంగా మారుతున్నాయి.. ఈ సమయాన్ని వినియోగించుకోవడానికి నేతలు ఎన్నో రకాల వ్యూహాలు రచిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల నేపథ్యంలో మందుబాబులకు చేదువార్త అందించింది ఈసీ. ఈ రోజు సాయంత్రం నుంచి వైన్స్ షాపులు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.దీంతో ఎక్కడ చూసినా వైన్స్ షాపు ముందు భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ఎన్నికల వేళ ఎలక్షన్ కమీషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు 6 గంటలతో ప్రచారాలకు పూలిస్టాప్ పడనుంది. ఎన్నికల నేపథ్ంయలో వైన్స్ షాపులు మూసి వేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ షాపులు, కల్లు దుకాణాలు, బార్ షాపులు మే 11 నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 13 సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ షాపులు మూసి వేయనున్నారు. ఈ రెండు రోజులు డ్రై డేగా ప్రకటించారు. అంతేకాదు ఫలితాలు వెలువడే జూన్ 4 న కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రం ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది.

మే 13 కి ముందు నుంచే షాపులు వైన్ షాపులు బంద్ చేస్తే రాష్ట్రంలో ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు జరగవని భావించిన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల పాటు మద్యం షాపులతో పాటు కల్లు కంపౌండ్లు,బార్లు మూసివేయాలని ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా మరికొన్ని గంటల్లో వైన్స్ షాపులు బంద్ అన్న విషయం తెలిసిన మందుబాబులు వైన్స్ షాపుల ముందు క్యూ కట్టారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా వైన్స్ షాపులు కిట కిటలాడుతున్నాయి. కొన్ని వైన్స్ షాపుల్లో స్టాక్ నిండుకుందని బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. ఈ కొద్ది గంటలు తొందర పడకుంటే మూడు రోజుల పాటు సుక్క కూడా దొరికే ఛాన్సు ఉండదని మందు బాబులు వైన్స్ షాపుల ముందు క్యూ కడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి