iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌లో ఆ బీర్లు కొరత! ఎక్కడికిపోయినా నో స్టాక్ బోర్డ్స్!

  • Published Apr 27, 2024 | 4:47 PM Updated Updated Apr 27, 2024 | 4:47 PM

Beer Shortage in Hyderabad: తెలంగాణలో మార్చి నెల నుంచి ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ మాసానికి ఎండ తీవ్రగా బాగా పెరిగిపోవడంతో చల్లని పానియాల వైపు పరుగులు తీస్తున్నారు జనాలు. ఇక మందు బాబులు చల్లని బీర్లు ఫుల్ గా లాగించేస్తున్నారు.

Beer Shortage in Hyderabad: తెలంగాణలో మార్చి నెల నుంచి ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ మాసానికి ఎండ తీవ్రగా బాగా పెరిగిపోవడంతో చల్లని పానియాల వైపు పరుగులు తీస్తున్నారు జనాలు. ఇక మందు బాబులు చల్లని బీర్లు ఫుల్ గా లాగించేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఆ బీర్లు కొరత! ఎక్కడికిపోయినా నో స్టాక్  బోర్డ్స్!

తెలంగాణ వ్యాప్తంగా ఎండలు ముదిరిపోయాయి.. ఉదయం పది గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కొన్ని జిల్లాలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రాల నుంచి 45 డిగ్రీలకు పెరిగిపోయింది. ఎండలకు తట్టుకోలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వడగాలులు వీస్తున్నాయి. వేడికి తట్టుకోలేక చాలా మంది శీతలపానియాలు, మజ్జిక, కొబ్బరి బోండాలు, జ్యూస్ తెగ తాగేస్తున్నారు. ఇక మందు బాబుల మాత్రం వైన్స్ షాపులకు క్యూ కడుతున్నారు. చల్లని బీర్లు లాగించేస్తున్నారు. మందుబాబు అవసరాలు కొంతమంది వైన్స్ షాప్ యజమానులు క్యాష్ చేసుకుంటున్నారు. లైట్ బీర్లు కొరత చూపించి బ్రాండెడ్ బీర్లు అమ్ముతూ డబ్బు లాగేస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్ లో మందుబాబులు ఎక్కువగా లైబ్ బీర్లు లాగించేస్తున్నారు.. డిమాండ్ భారీగా పెరిగిపోవడంతో బీర్ల కొరత ఏర్పడింది. గ్రేటర్ హైదరాబాద్ లో పరిధిలో వైన్ షాపుల్లో బీర్లు కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.  కొంతమంది మందుబాబులు బ్లాక్ లో కొనిమరీ తాగేస్తున్నారు. ముఖ్యంగా లైట్ బీర్లు, ఆర్సీ లైట్, ట్యాబర్గ్, కేఎఫ్ లైట్ బీర్లు ఎక్కువగా కొరత ఉందని షాపు యజమానులు అంటున్నారు. దీంతో తప్పని సరి పరిస్థితిలో డబ్బు ఎక్కువైనా సరే స్టాంగ్ బీర్లు లాగించేస్తున్నారు. ఇష్టం లేకున్నా చల్లదనం కోసం స్టాంగ్ బీర్లు తాగవలసి వస్తుందని అంటున్నారు.  సాధారణంగా వేసవి సీజన్ లో బీర్ సేల్స్ ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే.

ఈసారి లైట్ బీర్లు కొరత ఎందుకు ఏర్పడిందో మందుబాబులకు అస్సలు అర్థం కావడం లేదు. హైదరాబాద్ తో సహా పరిసర ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్లినా లైట్ బీర్లు నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయని వాపోతున్నారు. ఆల్ట్రా లైట్ బీరు బ్రాండ్ దొరికినా ధర ఎక్కువ ఉండటంతో చిర్రెత్తిపోతున్నారు మందులుబాబులు. ఈ విషయంపై ఎక్సైజ్ శాఖ వారు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. గత సంవత్సరం 2023 మే నెలలో 4 కోట్ల 23 లక్షల బీర్లు అమ్ముడుపోయాయి. ఈ లెక్కన రోజుకు 23,50,164 బీర్లు లాగించేశారు.మరి ఈ ఏడాది మే నెలలో రోకళ్లు పగిలేలా ఎండలు కొడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో లైట్ బీర్లు దొరక్క పోవడం మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.