iDreamPost
android-app
ios-app

Ex CM కేసీఆర్ పై పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు!

  • Published Apr 27, 2024 | 7:54 PM Updated Updated Apr 27, 2024 | 7:54 PM

Complaint Against KCR: సాధారణంగా రాష్ట్రాలో కొత్తగా వచ్చిన అధికార పార్టీ గతంలో ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఫోకస్ పెడుతుంది.. ఇది జగమెరిగిన సత్యం. ఈ క్రమంలోనే తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన అవినీతిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Complaint Against KCR: సాధారణంగా రాష్ట్రాలో కొత్తగా వచ్చిన అధికార పార్టీ గతంలో ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఫోకస్ పెడుతుంది.. ఇది జగమెరిగిన సత్యం. ఈ క్రమంలోనే తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన అవినీతిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Ex CM కేసీఆర్ పై పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు!

గత ఏడాది చివర్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్ల పాటు పాలన కొనసాగించిన బీఆర్ఎస్ కి చెక్ పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలు తెలంగాణ ప్రజలకు నచ్చాయి. ఈ క్రమంలోనే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే ఆరు గ్యారెంటీ పథకాలపై తొలి సంతకం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఫోకస్ పెట్టారు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఓ లాయర్ ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు నువ్వా.. నేనా అన్న చందంగా ప్రచారాల్లో మునిగిపోయారు. ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి దిగుతున్నారు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ పై హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పై ఫిర్యాదు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య ఓ మీడియా ఛానల్ నిర్వహించిన డిబేట్ లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేయాలంటూ సదరు న్యాయవాది డిమాండ్ చేశారు. కేసీఆర్ తో పాటు మరో 36 మందిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

డిబేట్ సందర్భంగా కేసీఆర్ మాట్లాడతుూ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అనేది ప్రతి సర్కార్ లో జరుగుతుందని.. అది భద్రతా విభాగం చేసే పని.. దానికి సీఎం కి ఎలాంటి సంబంధం ఉండదని అన్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పై అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలు మాత్రమే.. ప్రస్తుత సీఎం కి కూడా ఇంటెలీజెన్స్ నుంచి ప్రతిక్షణం కీలక సమాచారాలు అందుతూనే ఉంటాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ విషయంపై ఫిర్యాదుదారుడు న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు గా పరిగణిస్తున్న ఇంటలీజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ అందుబాటులో లేకపోయినా.. కేసీఆర్ తో పాటు అప్పటి కేబినెట్ లో ఉన్న 39 మంది ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు తన ఫిర్యాదు పట్ల పోలీసులు అలసత్వం వహించకుండా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.