iDreamPost
android-app
ios-app

Abdullahpurmet: హైదరాబాద్ లో దారుణం.. భర్త ఇలా చేస్తాడని భార్య అస్సలు ఊహించలేదు!

  • Published Jan 16, 2024 | 7:00 PM Updated Updated Jan 16, 2024 | 7:00 PM

హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణం చోటుచేసుకుంది. తన భర్త ఇలా చేస్తాడని ఆ ఇల్లాలు అస్సలు ఊహించలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే?

హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణం చోటుచేసుకుంది. తన భర్త ఇలా చేస్తాడని ఆ ఇల్లాలు అస్సలు ఊహించలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే?

  • Published Jan 16, 2024 | 7:00 PMUpdated Jan 16, 2024 | 7:00 PM
Abdullahpurmet: హైదరాబాద్ లో దారుణం.. భర్త ఇలా చేస్తాడని భార్య అస్సలు ఊహించలేదు!

జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా ఏడడుగులు వేశాడు ఆ వ్యక్తి. తన కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటాడని నమ్మింది ఆ భార్య. పెళ్లి తర్వాత వీరి దాంపత్యం ఎంతో అన్యోన్యంగానే సాగింది. ఈ దంపతుల ప్రేమకు గుర్తుగా సంతానం కూడా కలిగింది. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ.. ఆ భర్త ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ లో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగిందటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినయ్-పుష్పలత అనే దంపతులు హైదరాబాద్ శివారులో ఉన్న అబ్దుల్లాపూర్ మెట్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం వినయ్ దారుణానికి పాల్పడ్డాడు. తన భార్య పుష్పలతను తల నరికి దారుణంగా చంపాడు. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి.. నిందితుడు వినయ్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది అనే అనుమానంతో అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbabilonbet girişgrandpashabet