వీడియో: RTC కండక్టర్‌పై మహిళ దాడి! గొడవకు కారణం ఏంటంటే?

RTC Conductor: ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులపై ముఖ్యంగా ఆర్టీసీ సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా బానెట్ పై కూర్చొవద్దు అన్నందుకు ఓ మహిళా ప్రయాణికురాలు ఆర్టీసీ బస్ కండక్టర్ పై దాడికి దిగింది.

RTC Conductor: ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులపై ముఖ్యంగా ఆర్టీసీ సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా బానెట్ పై కూర్చొవద్దు అన్నందుకు ఓ మహిళా ప్రయాణికురాలు ఆర్టీసీ బస్ కండక్టర్ పై దాడికి దిగింది.

మనం వినియోగించే రవాణ వ్యవస్థల్లో ఆర్టీసి ప్రధానమైనది. దీని ద్వారా నిత్యం ఎంతో మంది తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. ఇది ఇలా ఉంటే.. ఇటీవల ఆర్టీసీ సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయి. మంచి చెప్పిన కూడా  వినకుండా తిరిగి ఆర్టీసీ సిబ్బందిపైనే కొందరు దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ పునరావృతం అవుతున్నాయి. తాజాగా బస్సులో బానెట్ పై కూర్చొవద్దు అన్నందుకు ఓ కండక్టర్ పై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బుధవారం హనుమకొండ జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ బస్సు ఏటూరు నాగారం వెళ్తోంది. ఈ క్రమంలోనే ఆత్మకూరు గ్రామం దగ్గర ఓ మహిళా ప్రయాణికురాలకి కండక్టర్ కి మధ్య వాగ్వాదం జరిగింది. ఆత్మకూరు మండలం భూపాలపట్నం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో మహిళ ప్రయాణికురాలి బందువులు వీరంగం సృష్టించారు. అలా మహిళా ప్రయాణికురాలితో  కండెక్టర్ కు తలెత్తిన వివాదం పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్ళింది. ఏటూర్ నాగారం వైపు వెళ్తున్న ఓ మహిళా బస్సులో సీటు లేకపోవడంతో డ్రైవర్ పక్కనే ఉండే ఇంజన్ బానెట్ పై కూర్చున్నారు. అయితే అదే సమయంలో ఆ బానెట్ పై కూర్చొవద్దని సదరు మహిళకు కండక్టర్ తెలిపాడు. ఈ క్రమంలోనే ఆమెకు కండక్టర్ కి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా చిలికి చిలికి గాలివాన తుఫాన్ గా మారినట్లు పెద్దగా అయ్యింది.

ఈ నేపథ్యంలోనే మహిళా ప్రయాణికురాలిపై స్థానికంగా ఉన్న ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో కండక్టర్ ఫిర్యాదు చేశాడు. ఇదే  విషయాన్ని తన కుటుంబసభ్యులకు చేరవేసింది సదరు మహిళ. దాంతో  ముప్పై కిలోమీటర్ల తరువాత బస్సును వెంబడి ఆ మహిళ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. బస్సుకు ద్విచక్రవాహనాన్ని అడ్డుగా పెట్టి.. మహిళా ప్యాసింజర్ కొడుకు మోహన్.. కండక్టర్ పై దాడికి దిగాడు. కాగా, ఈ ఘటనపై ములుగు జిల్లా కేంద్రంలో మరోసారి కేసు నమోదు చేశారు. డ్రైవర్, కండక్టర్ విధులకు ఆటంకం కలిగించి, దాడి చేసిన సదరు మహిళా ప్రయాణికురాలు, ఆమె కొడుకు మోహన్ పై చర్యలు తీసుకువాలని ఆర్టీసీ సిబ్బంది కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show comments