iDreamPost
android-app
ios-app

సిటీ బస్సులోనే ప్రసవం.. మహిళా కండక్టర్ మానవత్వం! సజ్జనార్ ట్వీట్

  • Published Jul 05, 2024 | 3:32 PM Updated Updated Jul 05, 2024 | 3:32 PM

MD Sajjanar Tweet: నిండు గర్భిణి.. బస్సులో ప్రయాణం చేస్తుంది. అంతలోనే ఆమెకు పురిటినొప్పులు రావడంతో మహిళా కండెక్టర్ చూపించిన చొరవపై ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు.

MD Sajjanar Tweet: నిండు గర్భిణి.. బస్సులో ప్రయాణం చేస్తుంది. అంతలోనే ఆమెకు పురిటినొప్పులు రావడంతో మహిళా కండెక్టర్ చూపించిన చొరవపై ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సిటీ బస్సులోనే ప్రసవం.. మహిళా కండక్టర్ మానవత్వం! సజ్జనార్ ట్వీట్

సాధారణంగా మహిళలు బిడ్డకు జన్మనివ్వడం అంటే కొత్త జన్మ ఎత్తినట్లే అంటారు. ప్రసవ సమయంలో ఆమె ధైర్యంగా ఉండాలని పుట్టింటికి పంపుతారు. ఈ మధ్య కాలంలో చాలా వరకు నార్మల్ డెలివరీ కాకుండా ఆపరేషన్ ద్వారా పిల్లలు కంటున్నారు. హైదరాబాద్ లో ఓ నిండు గర్భిణి బస్సు లో ప్రయాణం చేస్తుంది. మధ్యలో ఆమెకు అనుకోకుండా పురిటినొప్పులు రావడంతో బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు కంగారు పడ్డారు. ఆ సమయంలో లేడీ కండక్టర్ సమయస్ఫూర్తి ప్రదర్శించారు. ఆమె చేసిన పనికి ఇప్పుడు ఎంతో గొప్పగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంతకీ ఆ లేడీ కండక్టర్ ఏం చేసిందీ? స్వయంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆమెను పొగుడుతున్నారు? పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ ఆరంఘర్ నుంచి సర్వీస్ 81/1 రూట్ నెంబరు 1Z బస్సులో సికింద్రబాద్ కి వస్తున్న ఓ నిండు గర్భిణికి బస్సులో పురిటినొప్పులు రావడం మొదలయ్యాయి. దీంతో తోటి ప్రయాణికులు ఈ విషయం సరోజ అనే కండెక్టర్ కి తెలిపారు. వెంటనే ఆమె డ్రైవర్ ని బస్సు పక్కకు ఆపాలని సూచించింది. బస్సు పక్కకు ఆపగానే ప్రయాణికులను కిందకు దింపేశారు. తోటి మహిళా ప్రయాణికులు సాయంతో సరోజ ఆ మహిళకు డెలివరీ చేశారు.ఈ రోజు (జులై 5) ఉదయం 7 గంటల 30 నిమిషాలకు పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది ఆ మహిళ. వెంటనే అదే బస్సులో తల్లీ బిడ్డలను గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించారు.

ఈ సంఘటన చూసి తోటి ప్రయాణికులు, డ్రైవర్ మహిళా కండెక్టర్ సరోజను అభినందించారు. బస్సులో కాన్పు చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్ సరోజ తో పాటు సహ మహిళా ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించారు. ఆమె అప్రమత్తమైన వెంటనే స్పందించడం వల్ల ఈ రోజు తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రయాణికులను గమ్య స్థానానికి చేర్చడమే కాదు.. ఇలాంటి సేవా స్ఫూర్తిని ఆర్టీసీ సిబ్బంది చాటుకోవడం గర్వించదగ్గ విషయం అని సంతోషం వ్యక్తం చేశారు.