Labor department good news for Telangana voters: తెలంగాణ ఓటర్లకు కార్మిక శాఖ గుడ్ న్యూస్!.. ఏం చెప్పిందంటే?

తెలంగాణ ఓటర్లకు కార్మిక శాఖ గుడ్ న్యూస్!.. ఏం చెప్పిందంటే?

తెలంగాణ కార్మిక శాఖ ఓటర్లకు శుభవార్తను అందించింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు,కార్మికులందరికీ ప్రయోజనం కలుగనున్నది.

తెలంగాణ కార్మిక శాఖ ఓటర్లకు శుభవార్తను అందించింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు,కార్మికులందరికీ ప్రయోజనం కలుగనున్నది.

తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వారి వారి నియోజక వర్గాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో కలియతిరుగుతు తమకే ఓటువేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణ గడువులు ముగిశాయి. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లకు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ శుభవార్తను అందించింది. పోలింగ్ తేదీనాడు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఓటర్లు పోలింగ్ లో పాల్గొనేందుకు ఎలక్షన్ కమిషన్ అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ లేబర్ డిపార్ట్ మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరు పోలింగ్ లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని.. నవంబర్ 30న కార్మికులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది. తెలంగాణలోని కార్మికులు, షోరూంలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, కర్మాగారాలు, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారికి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని కార్మికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేల వీలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ తెలిపింది.

ఇక ఎన్నికల్లో పోటీచేసే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుండగా, మా పార్టీలను గెలిపించండంటూ కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ఓటర్లను అభ్యర్థిస్తున్నాయి. వారి వారి మేనిఫెస్టోలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా నవంబర్ 30 న పోలింగ్ జరుగనుండగా, డిసెంబర్ 3 న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

Show comments