iDreamPost
android-app
ios-app

దొరికిన కుర్చీతాత ఆచూకీ.. వారం నుండి ఎక్కడ ఉన్నారంటే..?

  • Published Dec 28, 2023 | 6:45 PM Updated Updated Dec 28, 2023 | 7:08 PM

సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏ సమయంలో, ఏ వయస్సులో ఫేమస్ అయిపోతారే చెప్పడం కష్టం. అందుకు ఉదాహరణ కుర్చీ తాత. హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ వద్ద.. కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్‌తో సోషల్ మీడియా ట్రెండింగ్ లో నిలిచారు.

సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏ సమయంలో, ఏ వయస్సులో ఫేమస్ అయిపోతారే చెప్పడం కష్టం. అందుకు ఉదాహరణ కుర్చీ తాత. హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ వద్ద.. కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్‌తో సోషల్ మీడియా ట్రెండింగ్ లో నిలిచారు.

  • Published Dec 28, 2023 | 6:45 PMUpdated Dec 28, 2023 | 7:08 PM
దొరికిన కుర్చీతాత ఆచూకీ.. వారం నుండి ఎక్కడ ఉన్నారంటే..?

సోషల్ మీడియాలో చిన్న డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు కుర్చీ తాత. కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ అతడిని సెలబ్రిటీని చేసేసింది. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొనడంతో పాటు జబర్దస్త్ వంటి షోల్లో కూడా మెరిశారు. ఆ తర్వాత కుర్చీ తాత హవా తగ్గిపోతూ వచ్చింది. అయితే ఆయన కొన్ని రోజుల నుండి కనిపించడం లేదంటూ.. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూల్లో కన్నీరు మున్నీరు అయ్యారు కుటుంబ సభ్యులు. దాదాపు వారం రోజుల నుండి ఆచూకీ లభించడం లేదంటూ పేర్కొన్నారు. ఆయన ఆచూకీ తెలిసిన వారు తమకు సమాచారం అందించాలని కుర్చీతాత భార్య, కూతురు మొరపెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన దొరికినట్లు తెలుస్తోంది.

కుర్చీ తాత కనిపించకపోవడంతో చాలా మంది రెస్పాండ్ అయ్యారట. మరో యూట్యూబర్ వైజాగ్ సత్య అనే వ్యక్తి సహకారంతో కుర్చీతాత జాడ దొరికింది. ‘యూట్యూబ్ లో వీడియో చూసి.. వరంగల్ నుండి కొంత మంది ఫ్రెండ్ ఫోన్ చేసి.. వరంగల్ రైల్వే స్టేషన్ లో పడుకున్నారు అని చెప్పారు. నేను కొంత మంది స్నేహితులకు ఫోన్ చేసి కన్ఫ్మమ్ చేసుకున్నాక.. నైట్ కారులో వెళ్లి తీసుకువచ్చాను’ అంటూ యూట్యూబర్ చెప్పారు. తన భార్య బాధపడిందని తెలిసే సరికి కుర్చీ తాత కన్నీటి పర్యంతమయ్యారు. తనది లవ్ మ్యారేజ్ అని, తన అన్నను చంపినా కూడా.. తన భార్య తన చేయి వదలలేదంటూ ఏడ్చేశారు. తన భార్య దేవత అంటూ చెప్పుకొచ్చారు.

ఈ ఒక్క డైలాగ్‌తో ఆయనను పలు యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు చేశాయి. తనకు పేరు రావడంతో వరుసగా ఇంటర్వ్యూలు  ఇచ్చేవారు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో కూడా పాల్గొన్నారు.  ఆయనతో మాటలు కలిపేందుకు సోషల్ మీడియా ఛానల్స్ ఎగబడ్డాయి. అయితే 7రోజుల నుండి ఆయన కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో మంచి రెస్పాన్స్ వచ్చి.. ఆయనను గుర్తించి.. సత్య అనే వ్యక్తికి సమాచారం అందించడంతో.. ఆయన సేఫ్ గా తిరిగి తీసుకువచ్చారు.

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet