iDreamPost
android-app
ios-app

కుర్చీతాతకు క్యాన్సర్.. పరిస్థితి విషమం..

  • Published Feb 19, 2024 | 3:15 PM Updated Updated Feb 19, 2024 | 3:15 PM

 ఒక్క డైలాగ్ ఒకే ఒక్క డైలాగ్ అతడు ఎవరో  తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసింది.  యూట్యూబ్‌లో అతడు చెప్పిన ఓ డైలాగ్ అతడ్ని ఫేమస్ చేసేసింది. అతడు ఎవరో కాదూ.. కుర్చీతాత.

 ఒక్క డైలాగ్ ఒకే ఒక్క డైలాగ్ అతడు ఎవరో  తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసింది.  యూట్యూబ్‌లో అతడు చెప్పిన ఓ డైలాగ్ అతడ్ని ఫేమస్ చేసేసింది. అతడు ఎవరో కాదూ.. కుర్చీతాత.

  • Published Feb 19, 2024 | 3:15 PMUpdated Feb 19, 2024 | 3:15 PM
కుర్చీతాతకు క్యాన్సర్.. పరిస్థితి విషమం..

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం కష్టం. సామాన్యుడు సైతం సెలబ్రిటీని చేయగలుగుతున్నాయి సామాజిక మాధ్యమాలు. యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, స్నాప్ చాట్స్ ద్వారా చాలా మంది ఫేమస్ అవుతున్నారు. రోడ్డుపై భిక్షాటన చేసిన బూతులు తిడుతూ కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు నిరూపించాడు షేక్ అహ్మద్ పాషా అలియాస్ కుర్చీతాత.  హైదరాబాద్‌లో కృష్ణ కాంత్ పార్క్ వద్ద భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, పిల్లలు ఉన్నారు.

‘ ఆ కుర్చీ మడత పెట్టి’ అనే డైలాగ్‍ ఓ బిక్షాటన చేసే వ్యక్తిని సెలబ్రిటీ హోదాకు తీసుకు వచ్చింది.  అతడే షేక్ పాషా కాస్త.. కుర్చీతాతగా మారిపోయాడు. అతడిని మరింత ఫేమస్ చేసేశాయి యూట్యూబ్ ఛానల్స్. దీంతో కుర్చీతాతకు ఎక్కడ లేని పబ్లిసిటీ వచ్చింది. ఇదే డైలాగ్‌ను మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం మూవీలో వినియోగించారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఈ పాట సినిమాకు ఎస్సెట్ అయిన సంగతి విదితమే. అతడికి చిత్ర యూనిట్ రూ. లక్ష రూపాయలు  రెమ్యునరేషన్ కూడా ఇచ్చింది.

ఇటీవల తోటి యూట్యూబర్లను తిట్టిన కేసులో జైలు పాలైన కుర్చీతాత.. కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఆ తర్వాత ఏం అయ్యారో కూడా తెలియదు.  అయితే ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఆయనకు ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుర్చీతాతను ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. గాంధీ ఆసుపత్రి వైద్యులు ఆయనకు పరీక్షించగా.. క్యాన్సర్ అని నిర్థారణ అయ్యింది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు. కాగా, ఆయన ఆల్కహాలిక్ కూడా కావడంతో ఈ వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom