iDreamPost
android-app
ios-app

వరద బాధితులకు కుమారీ ఆంటీ సాయం.. CM రేవంత్ రెడ్డిని కలిసి

Kumari Aunty: మీది థౌజండ్ అయ్యింది అంటూ ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారింది కుమారీ ఆంటీ. సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది. ఇక వరుస సినిమా ప్రమోషన్లు, పొలిటికల్ ప్రచారాల్లో పాలు పంచుకుంది. ఇప్పుడు తన మంచి మనస్సును చాటుకుంది.

Kumari Aunty: మీది థౌజండ్ అయ్యింది అంటూ ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారింది కుమారీ ఆంటీ. సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది. ఇక వరుస సినిమా ప్రమోషన్లు, పొలిటికల్ ప్రచారాల్లో పాలు పంచుకుంది. ఇప్పుడు తన మంచి మనస్సును చాటుకుంది.

వరద బాధితులకు కుమారీ ఆంటీ సాయం..  CM రేవంత్ రెడ్డిని కలిసి

‘హాయ్ నాన్న బాగున్నారా’ అంటూ కొసరి కొసరి వడ్డించి.. చివరకు ‘మీది థౌజండ్’ అయ్యింది అంటూ ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కుమారీ ఆంటీ. హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జి పరిసరాల్లో స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆమెను యూట్యూబర్లు, ఇన్ప్లుయెన్సర్స్ ఇంటర్వ్యూలు చేయడంతో ఒక్కసారిగా ఫేమ్ అయ్యింది. ఆమెపై ఓ వీడియో చేసి ట్రోలింగ్ చేయగా.. అది ఆమెకు మేలు చేసింది. చివరకు ఆమెకు ఊహించని విధంగా బిజినెస్ పెరగడంతో పాటు ఆమెకు సెలబ్రిటీగా మారింది. అంతలోనే ఆమె హోటల్ తీసేందుకు ప్రయత్నాలు చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మరింత ఫేమస్ అయిన కుమారీ ఆంటీ.. సినిమా ప్రమోషన్లు, షాపింగ్ వీడియోలతో సెన్సేషన్ అయ్యింది. అలాగే పొలిటికల్ ప్రచారాలు చేసింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మారి బాగానే ఫాలోవర్స్ పెంచుకుంది.  చివరకు బుల్లితెరపై కూడా సందడి చేసింది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు కుమారీ ఆంటీ తన మంచి మనస్సును చాటుకుంది. ఇటీవల తెలంగాణలో కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రాణ, ఆస్థి నష్టం వాటిల్లుతుంది. అనేక మంది నిరాశ్రయులయ్యారు. అలాగే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తమ వంతు సాయంగా ఆర్థిక సాయం ప్రకటించారు. కాగా, కుమారీ ఆంటీ తన వంతు ఆర్థిక విరాాళాన్ని అందించింది. వరద బాధితుల సహాయనిధికి రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి చెక్ అందించింది ఆమె. సీఎం రేవంత్ రెడ్డి ఆమెను శాలువా కప్పి సత్కరించారు. చిరు వ్యాపారం చేసుకుని బతుకుతున్న ఆమె.. 50 వేల రూపాయల వరద బాధితుల సహాయార్థం అందించి.. హ్యుమానిటీని ప్రదర్శించి మరోసారి సెలబ్రిటీ అయ్యింది.

తెలంగాణ, ఆంద్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు ఖమ్మం, మహబుబాబాద్.. అటు ఎన్టీఆర్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పంటలు నాశనం అయ్యాయి. ఈ పెను విపత్తుకు సినీ సెలబ్రిటీలు తమ వంతు సాయం ప్రకటించారు. ప్రభాస్ రెండు కోట్లు విరాళాన్ని అందించగా.. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, బాలకృష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కోటి రూపాయల సహాయాన్ని ప్రకటించారు. అలాగే చిన్న స్టార్స్ కూడా తమ వంతు సాయాన్ని అందించారు. వీళ్లే కాదు.. తమిళనటుడు శింబు కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ప్రకటించారు. తెలుగు నటీమణులు అనన్య నాగళ్ల, స్రవంతి చొక్కారపు తమకు చేతనైన ఆర్థిక సాయం అందించారు.