iDreamPost
android-app
ios-app

పెళ్లిరోజు సందర్భంగా భార్య పై ఎమోషనల్ ట్వీట్ చేసిన KTR!

  • Published Dec 19, 2023 | 12:07 PM Updated Updated Dec 19, 2023 | 1:05 PM

KTR wishes His Wife Shailima: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ప్రభుత్వం ఐటీ మంత్రిగా తనదైన మార్కును వేశారు. తాజాగా కేటీఆర్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

KTR wishes His Wife Shailima: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ప్రభుత్వం ఐటీ మంత్రిగా తనదైన మార్కును వేశారు. తాజాగా కేటీఆర్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

  • Published Dec 19, 2023 | 12:07 PMUpdated Dec 19, 2023 | 1:05 PM
పెళ్లిరోజు సందర్భంగా భార్య పై ఎమోషనల్ ట్వీట్ చేసిన KTR!

బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ గురించి అందరికి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడుగా.. రాజకీయాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా ప్రజలకు సేవలు అందిస్తూ యంగ్ అండ్ డైనామిక్ లీడర్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక తనదైన మాటలతో యూత్ లో కేటీఆర్ మంచి ఫాలోయింగ్ సంపాందించారు. తనదైన మాటలతో ప్రత్యర్థులను ఇరుకున పెడుతుంటారు. అయితే ఇలా ఒక పొలిటిషియన్ గా కేటీఆర్ ఎంత బిజీగా ఉన్న కుటుంబం విషయంలో చాలా కేర్ ని తీసుకుంటారు. కుటుంబం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తుంటారు. తాజాగా ఆయన పెళ్లి రోజు సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.

ప్రతి ఒక్కరికి వైవాహిక జీవితం చాలా మధురమైనది. రెండు వేరు వేరు మనస్సులు పెళ్లి అనే బంధంతో ఒకటవుతుంటాయి. ఇక ఎన్ని ఒత్తిడులు, ఇబ్బందులు ఎదురైన వాటిని అధికమించి జీవితంలో ముందుకుసాగి.. ఆదర్శ దంపతులుగా నిలిచినవారు ఎందరో ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం అనేది ఎక్కువగా పెరగడంతో.. చాలా మంది తన జీవితానికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటున్నారు. అలానే  చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు తమ జీవిత భాగస్వామిపై ప్రేమను తెలియజేస్తూ పలు ఆసక్తికరమైన  పోస్ట్ లను షేర్ చేస్తుంటారు.

KTR EMOTIONAL ON HIS WIFE

అదే విధంగా మాజీ మంత్రి కేటీఆర్ తన వైవాహిక బంధంపై సోషల్ మీడియాలో ఎమోషనల్ ట్వీట్ ని షేర్ చేశారు. కేటీఆర్ గారికి శైలిమ తో వివాహం జరిగింది. వీరికి హిమాన్షు అనే కుమారుడు ఉన్నాడు. అతడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇది ఇలా ఉంటే  తాజాగా కేటీఆర్ తన 20వ పెళ్లి రోజు సందర్భంగా భార్య శైలిమపై ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు. ఆమెను ఉద్దేశించి కేటీఆర్ ఆసక్తికరమైన పోస్టు చేశారు. ఎవరికైనా పెళ్లి రోజు మర్చిపోలేనిది. అలాంటి మధురమైన రోజును గుర్తు చేస్తూ కేటీఆర్ తన భార్యకు ప్రేమతో పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అందులో కేటీఆర్ ఇలా రాసుకొచ్చారు.. ‘నా అందమైన భార్యకు 20వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. రెండు దశాబ్దాలుగా నాకు అండగా నిలిచినందుకు, నాకు ఇద్దరు అందమైన పిల్లలను ఇచ్చినందుకు, నా జీవితంలో గొప్ప భాగస్వామిగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. మరెన్నో ఏళ్లు మనం ఇలాగే కలిసుండాలి’ అంటూ తన ఎక్స్ అకౌంట్ ద్వారా తమ పెళ్లి నాటి ఫోటోను  సోమవారం సాయంత్రం పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ ను చూసిన కేటీఆర్ అభిమానులంతా ఫిదా అయ్యారు. అంతేకాకుండా కేటీఆర్ కు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్యాన్స్,  బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో ట్వీట్లు చేశారు. ప్రసుత్తం కేటీఆర్ చేసిన ట్విట్  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి.. కేటీఆర్ పెళ్లినాటి ఫోటో, తన సతీమణిపై ఆయన చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio