iDreamPost
android-app
ios-app

గంగవ్వతో కలిసి నాటుకోడి కూర వండిన KTR!

  • Published Nov 05, 2023 | 12:19 PM Updated Updated Nov 05, 2023 | 12:19 PM

ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘మై విలేజ్‌ షో’లో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘మై విలేజ్‌ షో’లో పాల్గొన్నారు.

  • Published Nov 05, 2023 | 12:19 PMUpdated Nov 05, 2023 | 12:19 PM
గంగవ్వతో కలిసి నాటుకోడి కూర వండిన KTR!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘మై విలేజ్‌ షో’ ఎంతగా పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక, ఆ షో ఖ్యాతి రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. సినిమా ప్రమోషన్ల కోసం సినిమా వాళ్లు ఈ షోలో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పుడు షో రేంజ్‌ తారా స్థాయికి చేరింది. ఏకంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఈ షోలో పాల్గొన్నారు. గంగవ్వతో కలిసి వంట చేశారు. టీంతో ముచ్చటించి తన కుటుంబానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. తెలంగాణలో మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘మై విలేజ్‌ షో’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగవ్వతో కలిసి నాటు కోడి కూర వండారు. తర్వాత టీంతో ముచ్చటించారు. టీం అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. తనకు ఈత అస్సలు రాదన్నారు. తాను పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నానని చెప్పారు. కవిత తనకంటే మూడేళ్లు చిన్నదని, రాఖీ పండుగకు కవితకు చీర పెట్టినట్లు తెలిపారు.

తనకు ఇద్దరు బావ మరుదులు ఉన్నారని, వారు తనను బాగా చూసుకుంటారని వెల్లడించారు. అంతేకాదు! గంగవ్వ కుటుంబ వివరాలను, ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్లలో పోటీ చేసినప్పటికి ఒక్క చుక్క మందు పోయలేదని, అయినా.. ప్రజలు తనను గెలిపించారని చెప్పారు. మంచి చేస్తామని నమ్మకం ప్రజలకు కలిగించగలిగితే.. అక్కున చేర్చుకుంటారని అన్నారు. మరి, మంత్రి కేటీఆర్‌ మై విలేజ్‌ షోలో పాల్గొనటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobet