iDreamPost
android-app
ios-app

మానవత్వం చాటుకున్న KTR.. వైరలవుతోన్న వీడియో!

  • Published Jul 17, 2023 | 9:57 AM Updated Updated Jul 17, 2023 | 9:57 AM
  • Published Jul 17, 2023 | 9:57 AMUpdated Jul 17, 2023 | 9:57 AM
మానవత్వం చాటుకున్న KTR.. వైరలవుతోన్న వీడియో!

కేసీఆర్‌ తనయుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మంత్రి కేటీఆర్‌. ప్రస్తుతం తెలంగాణ ఐటీ మినిస్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్‌ వారసుడిగా రాజకీయాల్లో చాలా దూకుడుగా ఉంటారు కేటీఆర్‌. విపక్షాలపై విమర్శలు చేయడం.. వారికి తగ్గట్టుగా కౌంటర్‌ వేయడంలో ముందుంటారు కేటీఆర్‌. ఇక రాజకీయాలు మాత్రమే కాక.. జనాలు మరీ ముఖ్యంగా యువతకు చేరువవ్వడం కోసం సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు కేటీఆర్‌. ట్విట్టర్‌లో తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ.. ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కేవలం రాజకీయాల గురించి మాత్రమే కాక.. తన దృష్టికి వచ్చిన స్ఫూర్తిదాయకమైన అంశాల గురించి కూడా సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేస్తుంటారు కేటీఆర్‌. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్‌ చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. మీ కళ్ల ముందు సమస్య కనిపిస్తే చాలు వెంటనే స్పందిస్తారని మరోసారి నిరూపించుకున్నారు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఆ వివరాలు..

ట్విట్టర్‌లో యాక్టీవ్‌గా ఉండే కేటీఆర్.. ఎప్పుడు ఎవ్వరికి కష్టం అని తెలిసినా.. వెంటనే స్పందిస్తుంటారు. తన టీమ్‌ను పంపించి.. బాధితులకు చేతనైన సాయం అందిస్తుంటారు. నిత్యం సోషల్‌ మీడియా ద్వారా జనాలకు హెల్ప్‌ చేసే కేటీఆర్‌.. తాజాగా తన కళ్ల ముందు జరిగిన ఓ ప్రమాదం చూసి తక్షణమే స్పందించి.. సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కేటీఆర్‌ జగిత్యాల పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఓ చోట రోడ్డు మీద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్‌లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదాన్ని గమనించిన కేటీఆర్‌ వెంటనే తన కాన్వాయ్ ఆపి.. ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లారు.

అయితే ఆయన సంఘటన స్థలానికి చేరుకోవడాని కంటే ముందే.. తనతో పాటు ఉన్న డాక్టర్‌ని.. యాక్సిడెంట్‌ జరిగిన చోటుకి పంపించారు. క్షతగాత్రుల పరిస్థితి తెలుసుకుని వెంటనే తన వాహనంలో సమీప ఆస్పత్రికి తరలించారు. కేటీఆర్‌ ఇలా వెంటనే స్పందిచడమే కాక.. స్వయంగా తన వాహనంలోనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి పంపించి మానవత్వం చాటుకోవడంపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

marsbahis giriş