iDreamPost
android-app
ios-app

గన్‌మెన్‌కు చేతులెత్తి కృతజ్ఞతలు చెప్పిన కేసీఆర్‌.. కారణమిదే!

  • Published Oct 31, 2023 | 11:58 AM Updated Updated Oct 31, 2023 | 11:58 AM

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ని పరామర్శించడానికి ఆస్పత్రికి వెళ్లిన కేసీఆర్‌.. అక్కడే ఉన్న గన్‌మెన్‌కు చేతులెత్తి నమస్కారం చేశారు. ఎందుంటే..

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ని పరామర్శించడానికి ఆస్పత్రికి వెళ్లిన కేసీఆర్‌.. అక్కడే ఉన్న గన్‌మెన్‌కు చేతులెత్తి నమస్కారం చేశారు. ఎందుంటే..

  • Published Oct 31, 2023 | 11:58 AMUpdated Oct 31, 2023 | 11:58 AM
గన్‌మెన్‌కు చేతులెత్తి కృతజ్ఞతలు చెప్పిన కేసీఆర్‌.. కారణమిదే!

గన్‌మెన్‌లు, పోలీసులు నాయకులు, ప్రజల భద్రత కోసం కాపలా కాస్తుంటారు. కొన్ని సందర్భాల్లో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి.. నేతలను, జనాలను కాపాడతారు. వారి త్యాగాలను వెల కట్టలేము.. ఏమిచ్చినా కూడా వారి రుణం తీర్చుకోలేము. మహా అయితే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మాత్రం చెప్పగలము. తాజాగా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ కూడా గన్‌మెన్‌ పట్ల తన కృతజ్ఞతను ఇలానే చాటుకున్నారు. అందరి ముందు.. గన్‌మెన్‌కు చేతులెత్తి దండం పెట్టి మరీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరి ఇంతకు కేసీఆర్‌ గన్‌మెన్‌కు ఎందుకు దండం పెట్టాడు.. ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది అంటే..

మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. గట్టని రాజు అనే వ్యక్తి.. ప్రభాకర్‌ రెడ్డి మీద కత్తితో దాడి చేశాడు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాడి జరిగిన వెంటనే.. ప్రభాకర్‌రెడ్డిని చికిత్స నిమిత్తం.. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌.. సోమవారం కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటన ముగించుకుని.. ఆసుపత్రికి చేరుకుని ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించారు.

ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆడిగి తెలుసుకున్నారు కేసీఆర్‌. ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం హత్యా ప్రయత్నాన్ని అడ్డుకుని ఆయన ప్రాణాలు కాపాడిన గన్‌మెన్‌కు చేతులెత్తి నమస్కరించారు కేసీఆర్‌. సమయస్పూర్తితో వ్యవహరించి దుండగుడిని అడ్డుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ప్రమాదం జరిగిందిలా..

దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్త ప్రభాకర్‌రెడ్డి.. ఎన్నికల ప్రచారం నిమిత్తం.. సోమవారం మధ్యాహ్నం సూరంపల్లికి వెళ్లారు. అక్కడ పాస్టర్‌ అంజయ్యను పరామర్శించారు. తిరిగి బయలుదేరేందుకు కారు వద్దకు రాగా.. కొందరు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ముందుకు వచ్చారు. వారితో ఫొటోలు దిగుతుండగా.. అదే సమయంలో అక్కడకు వచ్చిన నిందితుడు గట్టని రాజు.. ప్రభాకర్‌రెడ్డికి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడానికి వచ్చినట్లుగా వచ్చి.. వెనుక నుంచి చేయి చాపుతూ ఆకస్మాత్తుగా తన జేబులో నుంచి కత్తి తీసి ఎంపీ కడుపులో.. కుడివైపు పొడిచాడు.

ఇది గమనించిన ఎంపీ వెంట ఉన్న గన్‌మెన్‌ వెంటనే తేరుకొని రాజును పట్టుకుని కత్తిని లాగేశాడు. అనంతరం ప్రభాకర్‌రెడ్డిని మెుదటగా గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి.. ఆ తర్వాత సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రభాకర్‌ రెడ్డిని పరీక్షించిన వైద్యులు.. దాదాపు 10 సెంటీమీటర్ల వరకు పేగు పూర్తిగా దెబ్బతిందని గుర్తించి.. అంతవరకు తొలగించారు. తర్వాత ఆయనని ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ మరో వారం నుంచి పది రోజులపాటు చికిత్స అందించాల్సి ఉందని డాక్టర్లు చెప్పారు. ఇక ప్రభాకర్ రెడ్డిపై దాడికి నిరసనగా నేడు దుబ్బాక బంద్‌కు బీఆర్ఎస్ శ్రేణులు పిలుపునిచిచ్చాయి. ప్రస్తుతం దుబ్బాకలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.