iDreamPost
android-app
ios-app

యాదాద్రి కాదు యాదగిరి గుట్ట.. త్వరలో పేరు మారుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

  • Published Mar 02, 2024 | 2:25 PM Updated Updated Mar 02, 2024 | 2:25 PM

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి పేరు మార్పుపై సంచలన ప్రకటన చేశారు. ఆ వివరాలు..

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి పేరు మార్పుపై సంచలన ప్రకటన చేశారు. ఆ వివరాలు..

  • Published Mar 02, 2024 | 2:25 PMUpdated Mar 02, 2024 | 2:25 PM
యాదాద్రి కాదు యాదగిరి గుట్ట.. త్వరలో పేరు మారుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. ఆలయాల పునరుద్ధరణకు పెద్ద పీట వేసింది. ఇక దీనిలో భాగంగా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి యాదగిరి గుట్ట ఆలయాన్ని పునర్‌నిర్మించారు. తిరుపతి తరహాలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు నడుం కట్టారు మాజీ సీఎం కేసీఆర్‌. సుమారు నాలుగైదేళ్ల పాటు శ్రమించి.. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత యాదగిరి గుట్ట పేరును కూడా యాదాద్రిగా మార్చారు. ఇప్పుడు ప్రతి రోజుల వేల సంఖ్యలో జనాలు యాదాద్రి నరసింహ స్వామిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. సెలవు రోజులు, పర్వదినాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాదాద్రి పేరు మార్పుపై కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. యాదగిరి గుట్ట పేరు మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరి గుట్టగా మారుస్తాము. దీనికి సంబంధించి తర్వలోనే జీవో జారీ చేస్తామని వెల్లడించారు. మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నేతలపై విమర్శలు చేశారు. కేటీఆర్ తండ్రి చాటు కొడుకు.. కానీ మేం ఉద్యమాలు చేసి వచ్చాము. తెలంగాణలో మా ప్రభుత్వం జీరో కరెంట్‌ బిల్ ఇచ్చినట్లు.. కేటీఆర్‌కు జీరో నాలెడ్జ్ అంటూ ఎద్దేవా చేశారు. బుద్ధి లేని కేటీఆర్‌ గురించి మాట్లాడుకోవడం శుద్ధ దండగ అంటూ ఎద్దేశా చేశారు.

అంతేకాక హరీశ్‌ రావుకు ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకపోతే తను కూడా బీజేపీలోకి వెళ్లి పోతాడంటూ కోమటిరెడ్డి జోస్యం చెప్పుకొచ్చారు. కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డ ఎందుకు పోలేదని ప్రశ్నించారు. అంతేకాక కాళేశ్వరం పనికిరాదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రజలే కేసీఆర్‌ను నామరూపాలు లేకుండా చేశారని ఆరోపించారు. అంతేకాక రానున్న లోక్‌కసభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థులపై ఇంటర్నల్ సర్వే జరుగుతోందని తెలిపారు.

అంతేకాక భువనగిరి నుంచి పోటీ చేయమని రాహుల్ గాంధీకి చెప్పాను అన్నారు కోమటిరెడ్డి. భువనగిరి, ఖమ్మం, నల్గొండ మూడు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీకి దక్షిణాదిలోనే అత్యధిక మెజార్టీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోదీ కంటే రాహుల్ గాంధే ఎక్కువ మెజార్టీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక యాదాద్రి పేరు మార్పు అనేది సంచలనంగా మారింది.