Dharani
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ఓ ఫ్యాన్సీ నంబర్‌కు కళ్లు చెదిరే ధర పలికింది. ఇంతకు ఆ నంబర్ ఏంటి.. ఎవరు ఎంత ఖరీదు చేసి కొన్నారంటే..
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ఓ ఫ్యాన్సీ నంబర్‌కు కళ్లు చెదిరే ధర పలికింది. ఇంతకు ఆ నంబర్ ఏంటి.. ఎవరు ఎంత ఖరీదు చేసి కొన్నారంటే..
Dharani
నేటి కాలంలో వాహనాలు కొనడానికి ఎంత ఆసక్తి చూపుతున్నారో.. దానికి నంబర్ ప్లేట్ గురించి కూడా అదే విధంగా ఆసక్తి చూపుతున్నారు కొందరు వాహనదారులు. నచ్చిన నంబర్, ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంత ఖర్చు పెట్టడానికి అయినా వెనకాడటం లేదు కొందరు. ఈ క్రేజ్ ఎలా ఉంటుంది అంటే.. వాహనం ఖరీదు కన్నా.. నంబర్ ప్లేట్‌కు పెట్టే ఖర్చే అధికంగా ఉంటుంది. ఇలాంటి వారు ఉండటం వల్లే ఆర్టీఏకు కాసుల పంట పండుతుంది. ఈ క్రమంలో తాజాగా 9999 ఫ్యాన్సీ నంబర్ కోసం ఓ వ్యక్తి భారీ మొత్తం ఖర్చు చేశాడు. ఇంత పెద్ద మొత్తం చెల్లించడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అంటున్నారు అధికారులు. ఇంతకు ఎవరా వ్యక్తి.. ఈ 9999 ఫ్యాన్సీ నంబర్ కోసం ఎంత ఖర్చు చేశాడంటే..
9999 నంబర్ కోసం ఓ వ్యక్తి.. ఏకంగా రూ.25,50,002 చెల్లించినట్లు హైదరాబాద్ జేడీసీ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా ఒక్కరోజే రవాణా శాఖకు రూ.43,70,284 ఆదాయం సమకూరింది. ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్ ప్రారంభమైన సందర్భంగా ఆన్‌లైన్ వేలం నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక వాహనం ఫ్యాన్సీ నంబరుకు ఏకంగా రూ.25.50 లక్షల ఆదాయం వచ్చింది అని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.
టీజీ 09 9999 నంబరును సోని ట్రాన్స్‌పోర్టు సొల్యూషన్స్ అనే కంపెనీ.. తమ టయోటా ల్యాండ్ క్రూజర్ ఎల్‌ఎక్స్ కోసం కొనుగోలు చేసింది. ఇందుకోసం ఏకంగా రూ.25,50,002 చెల్లించినట్లు హైదరాబాద్ జేడీసీ సి.రమేశ్ వెల్లడించారు. కాగా, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌కు రూ.25.50 లక్షలు వెచ్చించరని తెలుసుకున్న వారంతా అవాక్కవుతున్నారు. వార్నీ ఈ ధరతో మధ్యతరగతి వారు ఈజీగా నాలుగు కార్లు కొనుక్కోవచ్చు కదా అంటున్నారు. ఇక ఫ్యాన్సీ నంబర్‌కు ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం రాష్ట చరిత్రలో ఇదే తొలసారి అంటున్నారు అధికారులు.
ఇక గతంలో దుబాయ్‌లో 058-7777777 అనే మొబైల్ సిమ్ నంబర్ వేలం పాటలో రూ.7 కోట్లు ధర పలికిన సంగతి తెలిసిందే. దుబాయ్ వాసులకు 7 అంటే ప్రత్యేక అభిమానం మాత్రమే కాక.. సెంటిమెంట్ కూడా. దాంతో ఈ నంబర్‌కు ఇంత భారీ ధర చెల్లించారు. ముందుగా ఈ నంబర్ వేలం 22 లక్షల నుంచి ప్రారంభం అయ్యింది. కానీ నిమిషాల వ్యవధిలోనే కోట్లకు చేరింది. కన్ను మూసి తెరిచేలోగా.. ఏకంగా 7 కోట్ల రూపాయలకు చేరుకుంది.